Friday, April 19, 2024
- Advertisement -

రెమ్యునరేషన్ భారీగా తగ్గించేసిన స్టార్ హీరోయిన్

- Advertisement -

గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ‘కవచం’, ‘సీత’ వంటి సినిమాలతో వరుసగా డిజాస్టర్ లు అందుకున్న కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే విడుదలైన ‘రణరంగం’ సినిమాతో కూడా మరొక డిజాస్టర్ ను అందుకుంది. అయితే కోలీవుడ్లో మాత్రం ఈమె హీరోయిన్గా నటించిన ‘కోమలి’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఇప్పుడు కాజల్ అగర్వాల్ చాలా కాలం తర్వాత మళ్లీ బాలీవుడ్లో ఒక సినిమా చేయబోతుంది. కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఒక గ్యాంగ్ స్టార్ సినిమాలో జాన్ అబ్రహం తో రొమాన్స్ చేయబోతుందట.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాజల్ ఈ సినిమా కోసం చాలా తక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుంటుందట. కథ బాగా నచ్చడంతో ఈ సినిమాని కేవలం 30 లక్షల రెమ్యునరేషన్ కి చేసేందుకు కాజల్ ఒప్పుకుందట. నిజానికి బాలీవుడ్ ఆఫర్ కోసం కాజల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరియు రెమ్యునరేషన్ గురించి పట్టించుకోకుండా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -