Saturday, April 20, 2024
- Advertisement -

ఫ్లాప్ హీరోతో కలిసి ప్రాంక్ చేసిన కాజల్

- Advertisement -

ఈ మధ్యనే మంచు హీరో విష్ణు భార్య పండంటి విరానికా మంచు ఒక ఆడపిల్ల కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే విరానికా డెలివరీకి ముందు రోజు మంచు విష్ణు ఒక పోస్ట్ చేశాడు. ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇచ్చిన సలహా మేరకు తన భార్య డెలివరీ ఇంస్టాగ్రామ్ లో లైవ్ ఇవ్వబోతున్న ట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ పోస్ట్ కింద “అప్పుడు నేను నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను” అని విరానికా ఫన్నీ గా రిప్లై ఇచ్చింది. దానికి మంచు విష్ణు “ఇలాంటి వయలెంట్ బెదిరింపుల వల్ల నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ చేయడం లేదు. మోహన్ బాబు గారు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు” అంటూ పోస్ట్ చేశాడు.

మంచు విష్ణు మరియు కాజల్ అగర్వాల్ కలిసి సరదాగా ఈ పని చేసారని తెలిసిందే. ఎందుకంటే ఎవరూ డెలివరీ సోషల్ మీడియాలో లైవ్ ఇవ్వరు. అందుకే కాజల్ అగర్వాల్ మరియు విష్ణు ప్లాన్ చేసి మరీ ఇలా చేసినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు త్వరలోనే ఒక సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేయడం కోసం కాజల్ మరియు విష్ణు ఇలాంటి ప్రాంక్ చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -