Saturday, April 20, 2024
- Advertisement -

‘118’ మూవీ రివ్యూ

- Advertisement -

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ వ‌రుస‌గా సినిమాలు అయితే చేస్తున్నాడు కాని, ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్ మాత్రం ప‌డ‌లేద‌నే చెప్పాలి. అత‌నొక్క‌డే, ప‌టాస్ సినిమాలే క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో హిట్ సినిమాలు. తాజాగా క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన సినిమా 118. ప్ర‌ముఖ కెమెరామ్యాన్ గుహాన్ ఈ సినిమాతో దర్శ‌కుడుగా మారాడు. నివేదా థామ‌స్, షాలిని పాండేలు హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా అయిన క‌ల్యాణ్ రామ్‌కు హిట్ ఇచ్చిందో లేదో స‌మీక్ష ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

కథ‌ :ఓ ఛానెల్లో గౌతమ్‌ (కల్యాణ్ రామ్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా పని చేస్తుంటాడు . ఒక పనిని మొద‌లుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ను ఓ కల బాగా డిస్ట్రబ్‌ చేస్తుంది. కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్‌ ఆ కల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో గౌతమ్‌కు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు గౌతమ్‌ కలలో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్‌ చేశాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌ : ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ద‌ర్శ‌కుడిగా మారాడు. రొటీన్‌ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్‌ఫిక్షన్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంట్రస్టింగ్ పాయింట్‌ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను ఇరికించకుండా సినిమా అంతా ఓకె మూడ్‌లో సాగటం ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌ హాఫ్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ సీన్స్‌తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్‌ను పక్కన పెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు అంత కన్విన్సింగ్‌గా అనిపించవు.

న‌టీన‌టులు :జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్‌ రామ్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. గ‌త సినిమాల క‌న్నా ఈ సినిమాలో కాస్తా గ్లామ‌ర్‌గా క‌నిపించాడు క‌ల్యాణ్ రామ్‌. ఇజం సినిమాలో రిపోర్టర్‌గా కనిపించిన కల్యాణ్‌ రామ్‌ ఈ సారి స్టైలిష్‌ పాత్రలో మరింతగా మెప్పించాడు. పర్ఫామెన్స్‌, యాక్షన్‌ సీన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా తన మార్క్‌ చూపించింది. హీరోయిన్‌ షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది.

సాంకేతిక ప‌రిజ్ఞానం:సినిమాటోగ్రఫర్‌గా, ద‌ర్శ‌కుడిగా రెండు బాధ్య‌త‌ల‌ను బాగానే హ్యాండిల్ చేశాడు గుహన్.స్టైలిష్‌ టేకింగ్‌తో మెప్పించాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

బోట‌మ్ లైన్:క‌ల్యాణ్ రామ్ క‌ల‌ను నిజం చేయ‌లేకపోయిన 118

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -