Friday, March 29, 2024
- Advertisement -

థ్రిల్లర్ స‌స్పెన్స్‌తో క‌ల్యాణ్ రామ్ టీజ‌ర్ అదిరింది..!

- Advertisement -

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ చాలాకాలం నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.ప‌టాస్ హిట్ త‌రువాత క‌ల్యాణ్ రామ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ లేదు.దీంతో ఎలాగైన హిట్ కొట్టాల‌నే క‌సితో  ‘118’ అనే థ్రిల్లర్ స్టొరీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. క‌ళ్యాణ్ రామ్, శాలిని ల మధ్య రొమాంటిక్ సాంగ్ తో టీజర్ మొదలైంది. ఏదో ప్రమాదం జరిగినట్లుగా టీజర్ లో చూపించారు.కళ్యాణ్ రామ్    ఏదో  మిస్టరీని ఛేదించే ప్రయత్నాలలో ఉన్నట్టు గా చూపించారు.

కళ్యాణ్ రామ్ కు తోడుగా ప్రభాస్ శీను కూడా కనిపించాడు. జరిగిన సంఘటనకు 1.18 సమయానికి ఏదో సంబంధం ఉన్నట్టుగా చూపించారుశేఖర్ చంద్ర నేపధ్య సంగీతం టీజర్ కి హైలైట్ గా నిలిచింది.ప్ర‌ముఖ ఫోటో గ్రాఫ‌ర్ కేవీ గుహన్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడు.అయితే ఈ టీజ‌ర్‌లో హీరోయిన్ నివేదా థామస్‌ను ఎక్క‌డ చూపించ‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -