Thursday, March 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ను తమ్ముడు అని ఎందుకు పిలవనంటే : కల్యాణ్ రామ్

- Advertisement -

జూ ఎన్టీఆర్ అంటే కళ్యాణ్ రామ్ కు ఎంత ఇష్టమో ప్రత్యేంచి చెప్పనక్కర్లేదు. చాలా సందర్భాల్లో తమ్ముడు జూ ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ చెప్పాడు. తాజా మరోసారి ఎన్టీఆర్ పై కళ్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత మంచివాడవురా సినిమా విడుదల సందర్భంగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న కల్యాణ్‌రామ్.. తన తమ్ముడి గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. తారక్‌ను నాన్నా అని పిలుస్తానని, తమ్ముడు అని ఎప్పుడూ పిలవనని చెప్పాడు.

తమ్ముడు తనతో తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, కొన్నిసార్లు చిన్న పిల్లాడిగా ఉంటాడని తెలిపాడు. తమ్ముడిని అని పిలవలేనని.. కేవలం నాన్న అని మాత్రమే జూ ఎన్టీఆర్ ను పిలుస్తానని కళ్యాణ్ రామ్ చెప్పాడు. మాములుగా మేం ఏ సినిమాలు చేస్తున్నామో వాటి గురించి చిన్నపాటి డిస్కషన్ ఉంటుందని అలాంటి డిస్కష‌న్‌లోనే ఎంత మంచి వాడవురా కథ గురించి చెప్పగానే త‌ను హ్యాపీగా ఫీల‌య్యాడని తెలిపాడు.

అయితే అత‌నొక్కడే నుంచి 118 వ‌ర‌కు వైవిధ్యమైన చిత్రాల‌తో ప్రేక్షకుల‌ను మెప్పించిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్‌ రామ్ తాజాగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఎంత మంచివాడ‌వురాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శతమానం భవతి చిత్రంతో జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న వేగేశ్న సతీష్‌ ద‌ర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ అయ్యి.. మంచి హిట్ సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -