కమల్ హసన్ భారతీయడు చేయనని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడా..?

685
kamal hasan on indian 2
kamal hasan on indian 2

కమల్ హాసన్ నటించిన హిట్ సినిమా భారతీయుడు సినిమా కి సీక్వెల్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా కి మొదటినుంచి ఎదో ఒక ఆటంకం రావడంతో అసలు ఈ సినిమా పూర్తిగా తెరకెక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఇప్పటికే ఈ సినిమా యాక్సిడెంట్ కారణంగా స్టంట్ డిపార్ట్మెంట్ లోని పలువురు చనిపోగా కరోనా వల్ల ఈ సినిమా మళ్ళీ షూటింగ్ కి నోచుకోలేదు. తాజాగా తన షూటింగ్ భాగాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వచ్చే జనవరిలోగా పూర్తి చేసేయాలని కమల్ దర్శకుడు శంకర్ కి తాజాగా సూచించినట్టు తెలుస్తోంది.

ఎందుకంటే, ఆమధ్య కమల్ రాజకీయపార్టీని నెలకొల్పి రాజకీయాలలో సైతం బిజీ అయ్యారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో తాను పాల్గొనవలసి వున్నందున కమల్ ఈ చిత్రాన్ని ముందుగానే పూర్తిచేసుకుని, ఇక రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఈ సీక్వెల్ లో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సిద్ధార్థ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్టు చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇక రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఒక సంచలనం. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై కొత్త శైలి పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కమలహాసన్ చూపిన అభినయం.. దర్శకుడు శంకర్ ప్రతిభ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్.

Loading...