Wednesday, April 24, 2024
- Advertisement -

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. చంద్రబాబుకు షాకిచ్చిన వర్మ

- Advertisement -

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను నిర్మిస్తున్నానని చెప్పిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను అందరూ అదీ పట్టాలెక్కుతుందా అని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ అక్కడున్నది వర్మ.. ఊరికే వదల్లేదు. ఏకంగా టైటిల్ అనౌన్స్ చేయడమే కాదు.. తాజాగా శుక్రవారం ఒక పాటను కూడా రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు..

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ కమ్మ లాబీ, చంద్రబాబు, ఆయన మీడియాను కడప రెడ్డి సామాజికవర్గానికి చెందిన సీఎం వైఎస్ జగన్ ఎలా ఎదుర్కొంటున్నాడన్నది పాటతో సవివరంగా చూపించేశాడు వర్మ. వర్మ యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది.

కత్తుల్లేవు.. చిందే నెత్తురు లేదు.. యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారిందిప్పుడు అని పాటలో ప్రాస కలిపి చంద్రబాబును, ఆయన సన్నిహిత మీడియా అధినేతలను, టీడీపీ నేతలను వీడియోలో విజువల్స్ గా చూపిస్తూ ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా వర్మ తాజాగా పాటను రిలీజ్ చేశారు.

వర్మ ఈ పాటలో సీబీఐ, టీవీ అధినేతలు, సహా వైసీపీని, జగన్ ను టార్గెట్ చేసిన అందరినీ స్పష్టంగా వీడియోలో చూపించి ఏకిపారేశాడు. రవిశంకర్ పాడిన ఈ పాటను సిరాశ్రీ రచించాడు. తాజా రాజకీయ పరిణామాల వీడియోలను ఈ పాటలో పెట్టి వర్మ విడుదల చేసిన ఈ సాంగ్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై హాట్ చర్చకు దారితీస్తోంది.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ’ పాట ఇదే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -