Wednesday, April 24, 2024
- Advertisement -

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ రెండో ట్రైలర్..!

- Advertisement -

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో వివాదస్పద చిత్రం ’కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ఏపీ లో గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందన్న విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ “హఠాత్తుగా జరిగిన ఎవ్వరూ ఊహించని రాజకీయ పరిణామాలతో పిచ్చెక్కిపోయి, తమ మనుగడకే ముప్పొచ్చిందన్న నిస్పృహలో పడిపోయారు ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తండ్రీ కొడుకులు” ప్రారంభం అయింది.

“ఇలాంటి వాతావరణంలో ఇంకో ఐదేళ్లు కష్టమే. అప్పటికి మీకు 75 సంవత్సరాలు వస్తాయి… ఈలోగా మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే…” అన్న డైలాగ్స్ ఉన్నాయి. “కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం నాశనం చేశారు” అన్న డైలాగ్, అసెంబ్లీలో వైఎస్ జగన్ పాత్రధారి, చంద్రబాబు పాత్రధారిని హెచ్చరించడం, కొన్ని క్రైమ్ సీన్స్ ఈ ట్రైలర్ లో కనిపించాయి. “సినిమాల్లో నటించి, మీకు సేవ చేయడంలో ఉన్న విలువైన కాలాన్ని వృథా చేయనని మీకు హామీ ఇస్తున్నాను” అన్న పవన్ కల్యాణ్ పాత్రధారి డైలాగ్ కూడా వినిపిస్తోంది.

“వాళ్ల నాన్న గంగవీటి గంగా గారిని మర్డర్ చేయించింది మనమేనని తెలిసికూడా మన పార్టీలో చేరారు” అన్న లోకేశ్ పాత్రధారి డైలాగ్ ఉంది. ఈ ట్రయిలర్ ను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ దుమ్ములేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -