మహష్ భట్ తో కంగన పిక్..?

370
Kangana Ranaut's solitary pick with Mahesh Bhatt going viral ..
Kangana Ranaut's solitary pick with Mahesh Bhatt going viral ..

ముంబై విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది.. ఇప్పటికే ఆమె ఆఫీస్ ను నేలమట్టం చేసిన BMC ఆమె ఇల్లును కూల్చే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఆమెకు సోషల్ మీడియా లో కొంతమంది సపోర్ట్ తో పాటు వ్యతిరేకత కూడా లభిస్తుంది.

తాజాగా “సుశాంత్ కే కేస్ మే నయా మోడ్ ఆయా” (సుశాంత్ కేసులో కొత్త కోణం వచ్చింది) అంటూ నటి రాఖీ సావంత్ పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మహేశ్ భట్ పక్కన కంగన కూర్చుని ఉంది. ఈ పిక్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో రాఖీ పోస్ట్ చేసి, ఈ కొత్త కోణాన్ని చూడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాగా, ముంబై నగరం పీఓకేలా ఉందని కంగన వ్యాఖ్యానించిన తరువాత తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కంగనపై ప్రతీకార చర్యలకు దిగుతోందని ఆరోపణలు కూడా వచ్చాయి. కంగన కూడా ఏ మాత్రమూ తగ్గకుండా, వీలు చిక్కినప్పుడల్లా సీఎం ఉద్ధవ్ థాకరే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంది.

Loading...