Friday, March 29, 2024
- Advertisement -

మళ్ళీ రచ్చ రచ్చ చేస్తున్న కంగనా..బాలీవుడ్ పెద్దల పేర్లు..?

- Advertisement -

బాలీవుడ్ డేరింగ్ డాషింగ్ వుమన్ కంగనా రనౌత్ ఈమధ్య సినిమాల్లో కంటే వివాదల్లోనే ఎక్కువగా వినిపిస్తుంది.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ విషయంతో ఆమె వివాదాలు చేయడం శురూ చేసే ఆపేయడం మర్చిపోయింది.. తననుంచి కొత్త సినిమా వస్తూనే ఓ వివాదాన్ని తీసుకొచ్చి సినేమకంటే ఎక్కువగా జనాల నోళ్ళల్లో నానుతుంది. మణికర్ణిక సినిమా టైం లో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ని టార్గెట్ చేసి కొంత హడావుడి చేసింది..

ఇక కాస్టింగ్ కౌచ్ సమయంలో ఆడవారి సినీ పెద్దలు, సినీ కామందులు చేసే అన్యాయం పై కాస్టింగ్ కౌచ్ గొంతెత్తి పోరాటానికి చేయుతనిచ్చింది.. ఇక తాజాగా సుశాంత్ విషయంలోనూ తన వాయిస్ రైజ్ చేసి సంచలన ఆరోపణలు చేసింది. ఇక లేటెస్ట్ బాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే  పెద్దల పేర్లను బయటపెట్టి సంచలనం  రేకెత్తిస్తుంది. తాజాగా ఆమె డ్రగ్స్ వివాదంపై కూడా మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో సినీఇండస్ట్రీలో 99శాతం డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించింది.

డ్రగ్స్ సప్లై చేసే వారిని విచారిస్తే చాలామంది స్టార్ హీరోలు జైల్లోనే ఉంటారని తెలిపింది. ఈ మధ్యే ఓ హీరో డ్రగ్స్ బాగా సేవిస్తున్నాడని అతని భార్య విడాకులే ఇచ్చిందని ఆరోపించింది.ఎన్నోసార్లు హృతిక్ మీద కంగనా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యల్ని కూడా జనాలు అంత సీరియస్‌గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఇండస్ట్రీలో తనకు గురువు అని చెప్పుకునే వ్యక్తి తనకు డ్రగ్స్ రుచించి చూపించినట్లు కంగనా తెలిపింది. ఆ వ్యక్తి ఆదిత్య పంచోలిగా అనుమానిస్తున్నారు.ఏదేమైనా కంగనా డేరింగ్ తనాన్ని చూసి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు భయపడిపోతున్నారట…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -