వాడుకొని పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకున్న నటి..!

760
kannada actress chandana commits suicide
kannada actress chandana commits suicide

తన ప్రియుడు మోసం చేశాడని ఓ నటి ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్లుగా ప్రేమ పేరుతో వాడుకుని పెళ్లి అనేసరికి నిరాకరించడంతో ఆ నటి తట్టుకోలేక సెల్పీ వీడియో తీసుకొని మరీ విషం తాగి సూసైడ్ చేసుకుంది. విషయంలోకి వెళ్తే.. కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా పేరొందిన చందన (29) ది హాసన్ జిల్లా బేలూరు ప్రాంతం. బెంగళూరుకు చేరుకొని తావరకెరెలోని లేఔట్ లో నివాసం ఉంటోంది. పలు కన్నడ టీవీ సీరియల్స్ సినిమాలు పలు ప్రకటనల ద్వారా నటిగా గుర్తింపు పొందింది.

అయితే బెంగళూరులో నివాసం ఉంటున్న దినేష్ అనే యువకుడు ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఐదేళ్లుగా దినేష్ నటి చందన ప్రేమించుకుంటున్నారు. దినేష్ ను పెళ్లి చేసుకోవాలని చందన కలలు కన్నది, అయితే ఐదేళ్ళు వాడుకుని దినేష్ పెళ్లికి నో అనేశాడు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. తన ఫెరంట్స్ తో దినేష్ ఇంటికి వెళ్లి అడిగించింది. అయితే నటిగా ఆమె చాలా మందితో తిరిగిందని.. మా కోడలుగా చేసుకోము అంటూ దినేష్ తల్లిదండ్రులు అవమానించారు. ఐదేళ్లుగా తాను సంపాదించిన డబ్బులు మొత్తం జల్సాల కోసం ఖర్చు చేశాడని.. తనను శారీరకంగా వాడుకొని అబార్షన్ కూడా చేయించిన దినేష్ ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో చందన తట్టుకోలేకపోయింది.

జూన్ 1న సోమవారం డెత్ సూసైడ్ నోట్ చేసి సెల్ఫీ వీడియో తీసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లక్షల రూపాయలు వాడుకున్నాడని.. ఇప్పుడు నిరాకరిస్తున్నాడని వీడియోలో దినేష్ గురించి నిజాలు చెప్పింది. అనంతరం గ్లాసులో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మరో అమ్మాయిని దినేష్ మోసం చేయకుండా ఇలా చేస్తున్నాని విషం తాగింది. ఈ వీడియోను దినేష్ కు పంపడతో వెంటనే అతను ఆమె ప్లాట్ కు వెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆమె అప్పటికే మృతి చెందడంతో దినేష్ అక్కడ నుంచి పరారయ్యాడు. చందన చనిపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినేష్ కోసం వెతుకుతున్నారు.

Loading...