Friday, March 29, 2024
- Advertisement -

అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లి న‌వ్వినందుకుగాను..!

- Advertisement -

బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు రాజ్‌కపూర్ భార్య కృష్ణరాజ్‌ కపూర్ మంగ‌ళ‌వారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.దీంతో బాలీవుడ్ ప్ర‌ముఖులు రాజ్‌కపూర్ త‌మ ప్ర‌గాఢ సానుభుతిని తెలియ‌జేశారు. అమితాబ్‌ బచన్‌, ఆమిర్‌ ఖాన్‌, రాణీ ముఖర్జీ, కరణ్‌ జోహార్‌, అలియా భట్‌ వంటి ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణరాజ్‌ కపూర్ నివాళులు అర్పించాటానికి వ‌చ్చిన కరణ్‌ జోహార్‌, ఆమిర్‌ ఖాన్‌, రాణీ ముఖర్జీలు నవ్వుతూ క‌నిపించిన ఫోటోలో సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి.

వీరు ఇలా న‌వ్వ‌డంపై నెటిజన్లు మండిప‌డుతున్నారు.అంత్యక్రియలకు వ‌చ్చి ఇలా న‌వ్వ‌డంపై చాలమంది అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. వీరు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారా లేక​ పార్టీలోనా..? అని కామెంట్‌ చేశారు. కరణ్‌ జోహార్‌, ఆమిర్‌ ఖాన్‌, రాణీ ముఖర్జీలు సిగ్గుమాలిన పని చేశారంటూ వీరిని ట్రోల్‌ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -