’కార్తిక దీపం’ హీరోకి గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

607
karthika deepam lead actor receives mangoes from pawan kalyan
karthika deepam lead actor receives mangoes from pawan kalyan

పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి దూరంగా వచ్చేసి.. పూర్తిగా రాజకీయాల్లో ఉంటున్నారు. గత ఎన్నికలో రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటికి ఎక్కడ గెలవలేదు. అయినప్పటికి డీలా పడకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎప్పటికప్పడు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలపై పోరాడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓ సినిమాతో రాబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మించాబోతున్నాడని.. అలానే దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ పక్కనపెడితే పవన్ కళ్యాణ్ కు ఓ మామిడి తోట ఉంది. ప్రతి ఏడాది ఈ తోట నుండి కొందరు ప్రముఖుల ఇంటికి మామిడి పళ్ళు వెళ్తుంటాయి. త్రివిక్రమ్, నితిన్, అలీ వంటి వారికి ప్రతి ఏడాది మామిడి పళ్ళు వెళ్తుంటాయి.

ఈ ఏడాది ’కార్తిక దీపం’ సీరియల్ హీరో నిరుపమ్ కు పవన్ తోట నుంచి మామిడి పళ్ళు వెళ్ళాయి. కాకపోతే ఈ పండ్లను పంపింది మాత్రం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి గారు. ’కార్తికదీపం’ సీరియల్ లో నిరుపమ్ నటన బాగుందని.. పవన్ మామిడి తోటలోని పళ్ళను పంపిందని తెలుస్తోంది. సో దీనిబట్టి కార్తిక దీపంకు ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో అర్దం చేసుకోవచ్చు.

Loading...