బిగ్ బాస్ రికార్డులు బద్దలుకొడుతున్న కార్తీకదీపం

518
Karthika Deepam Serial Brakes Bigg Boss Telugu 3 Records
Karthika Deepam Serial Brakes Bigg Boss Telugu 3 Records

తెలుగు లొనే అతి పెద్ద రియాలిటీ షో గా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ మూడవ సీజన్ ఇప్పుడు జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని గేమ్ షోస్ లోను నంబర్ వన్ గేమ్ షో గా ఉన్న బిగ్ బాస్ తెలుగు టీవీ సీరియల్స్ ని మాత్రం బీట్ చేయలేకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. స్టార్ మా ఛానల్ లో సాయంత్రం 7:30 కు ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్ బిగ్ బాస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నడిపిస్తున్న బిగ్బాస్ షో 17.9 టివిఆర్ రేటింగ్ను సొంతం చేసుకోగా కార్తీకదీపం మాత్రం 18.36 టివిఆర్ రేటింగ్ తో ముందంజలో ఉంది.

ప్రతి వారాంతంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున వస్తున్నప్పుడు కూడా కేవలం టివిఆర్ కేవలం 10 లేదా 12 లో మాత్రమే ఉంటుంది కానీ కార్తీకదీపం సీరియల్ టి వి ఆర్ మాత్రం 15.4 నమోదు చేసుకుంది. ఒవరాల్‌గా జూలై 27 నుండి ఆగస్టు 2 వరకూ ఇంప్రెషన్ లెక్కలు చూస్తే కార్తీకదీపం సీరియల్‌ 15247 పాయింట్‌లతో మొదటి స్థానంలో ఉండగా, కోయిలమ్మ 8719, వదినమ్మ 8047, మౌనరాగం 7919, ఈటీవీ న్యూస్ 5511 పాయింట్లతో ఉన్నాయి. రేటింగ్స్ ప్రకారం గా అయితే రియాలిటీ షో అయిన బిగ్ బాస్ కంటే తెలుగు సీరియల్స్ కి ఉన్న క్రేజ్ ఎక్కువ అని చెప్పచ్చు.

Loading...