Friday, April 19, 2024
- Advertisement -

మూవీ రివ్యూ : కథనం సమీక్ష

- Advertisement -

ఈ రోజు మన్మధుడు 2 తో పాటు మరొక సినిమా కూడా విడుదల అయింది. అదే కథనం. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “కథనం”. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ని అనసూయ గట్టిగా నే ప్రమోట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ కూడా అందరినీ ఎంతగానో అలరించింది. ఇక ఈ సినిమా సమీక్ష విషయానికి వస్తే..

కథ:
అను (అనసూయ భరద్వాజ్) దర్శకుడు మారుతీ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీ లో ఒక బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సమయం లో తన స్నేహితుడు (ధన్రాజ్) తో కలిసి ఒక సినిమా చేయాలి అని అనుకుంటుంది. అను ఒక కథ రాసుకుంటుంది. ఆ కథ లో లాగానే రియల్ లైఫ్ లో మూడో హత్యలు జరుగుతాయి. రెండిటికీ సంబంధం కూడా ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న అనసూయ అప్పుడు ఏం చేసింది? ఎటువంటి పరిస్థితులని ఎదుర్కొంది? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా కథ.

నటీనటులు:
అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించిందని చెప్పుకోవచ్చు. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అనసూయ కి పర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ ఉన్న పాత్ర దక్కడంతో అనసూయ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ చాలా చక్కగా నటించింది. తన పాత్రలో ఒదిగిపోయి అనసూయ ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ధన్ రాజ్ కి ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దక్కింది. తను కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఎప్పటిలాగానే అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో చాలా చక్కగా చాలా సహజంగా నటించాడు. వెన్నెల కిషోర్ నటన కూడా సినిమాకి చాలా బలాన్ని చేకూర్చింది. అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులందరినీ బాగా నవ్విస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పృద్వి చాలా సహజంగా నటించారు. సమీర్ కూడా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం పనితనం:
రాజేష్ నాదెండ్ల ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను ఎంపిక చేశారు. కాంప్లెక్స్ కథ అయినప్పటికీ చాలా చక్కగా హాండిల్ చేస్తూ కథను చాలా బాగా నెరేట్ చేశారు. ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేవరకు అదే కథను పూర్తి చేశారు దర్శకుడు రాజేష్ నాదెండ్ల. బట్టేపాటి నరేంద్ర రెడ్డి మరియు శర్మ చుక్క అందించిన నిర్మాణ విలువలు సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. రోషన్ సలూర్ ఈ సినిమాకి చాలా మంచి సంగీతాన్ని అందించారు. పాటలు పక్కనపెడితే రోషన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని అన్ని సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది. సతీష్ ముత్యాల సినిమాకి మంచి విజువల్స్ అందించారు. అతని కెమెరా యాంగిల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎస్.బి.ఉద్ధవ్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
మిగతా థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే ‘కథనం’ సినిమాలో కామెడీ ఎలిమెంట్ కూడా తోడవడంతో కథ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. చాలా ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి అరగంటలోనే ప్రేక్షకులకు కథలో ఇన్వాల్వ్ అయి పోయేలా చేస్తుంది. మొదటి హాఫ్ మొత్తం కొంత కామెడీ కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో నిండి ఉండగా సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలతో ఉంటుంది. ముఖ్యంగా అనసూయ ఈ సినిమాలో నటించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి మరింత హెల్ప్ అయ్యాయి. అనసూయ నటన, కథ స్క్రీన్ ప్లే మరియు సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో కథ కొంచెం సాగదీసినట్లు అనిపించటం ప్రేక్షకులకు కొత్తగా ఇబ్బంది కలిగించవచ్చు. చివరిగా ‘కథనం’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే థ్రిల్లర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -