అది బిగ్ బాస్ హౌస్ కాదు బ్రోతల్ హౌస్

186
Kathi Mahesh Comments on Telugu Bigg Boss Controversy
Kathi Mahesh Comments on Telugu Bigg Boss Controversy

ఇంకా బిగ్ బాస్ టీవీ షో మొదలే కాలేదు కానీ అప్పుడే ఈ షో మీద ఎక్కడ లేని రూమర్స్ అన్నీ వచ్చేసాయి. ఈ సారి మూడో సీజన్ ని నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కి షో అంటే ఇష్టం లేదు కానీ షో హోస్ట్ చేయడానికి మాత్రం ఒప్పుకున్నాడు. ఈ విషయం కూడా కొత్తేమీ కాదు. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఇప్పుడు షో మీద వరుసగా పోలీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి. యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా, ఇంకా కేతిరెడ్డి హై కోర్టు లో పిల్ దాఖలు చేయడం కొంత చర్చనీయాంశం అయింది.

అయితే చాలా టీవీ షోస్ లో డిబేట్స్ కి వెల్తూ ఉన్న శ్వేతా రెడ్డి బిగ్ బాస్ హౌస్ ని బ్రోతల్ హోస్ అని చెప్తుంది. దీని పై పాత కంటెస్టెంట్స్ కొంత మంది తమ అభ్యంతరం తెలుపుతున్నారు. ముఖ్యంగా మహేష్ కత్తి అందులో ఒకరు. ఆయన శ్వేతా రెడ్డి పోరాటాన్ని స్వాగతిస్తూ నే ఆమె చేస్తున్న కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

“శ్వేతారెడ్డి పోరాటంతో నాకు సమస్య లేదు. కానీ ఇలా బిగ్ బాస్ కి వెళ్లిన ప్రతి మహిళా కాస్టింగ్ కౌచ్ రూట్లోనే వెల్లింది, కాబట్టి అది బ్రోతల్ హౌస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను బిగ్ బాస్ 1 లో భాగం. అక్కడికి వచ్చిన ఏ మహిళా తన ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి ఆ షోలో భాగం అవ్వలేదు. ఈ మాట నేను ఖరాఖండిగా చెప్పగలను. వాళ్ళు నాకు స్నేహితులు, అక్కలు, చెల్లెల్లు. వాళ్ళ మీద ఇంత నీచమైన అపవాదులు వెయ్యడం ఏవిధమైన పోరాటమో నాకు అర్ధం కావడం లేదు.” అని మహేష్ కత్తి తెలిపారు.

Loading...