కౌశల్ కాళ్లకు దండం పెట్టిన సుమ.. ఏమైందంటే ?

4514
kaushal in suma f3 program
kaushal in suma f3 program

బుల్లితెరపై ఎప్పటి నుంచో రాణిస్తోంది యాంకర్ సుమ. స్టార్ మహిళ షో అయితే ఎన్నో ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తుంది సుమ. ప్రస్తుతం కొత్త కొత్త ప్రొగ్రామ్స్ తో నవ్వించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో ఎఫ్3 అనే షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో సెలబ్రెటీల ఫ్యామిలీలను తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తారు.

ఇప్పటికే ఇందులో చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. బిగ్‌బాస్ రెండో సీజన్ లాంటిది మరొకటి రాదని అందరూ ఏకాభిప్రాయంతో చెప్పే మాట అది. అందులోని కంటెస్టెంట్లు, కౌశల్ ఆట తీరు, అతనికి పెరిగిన ఫాలోయింగ్, ర్యాలీలు చేపట్టడం లాంటి వాటితో బిగ్‌బాస్ షో క్రేజ్ ఎక్కడికో పోయింది. బిగ్‌బాస్ విన్నర్‌గా గెలిచాక కౌశల్ చేష్టలు కూడా ఎంతగానో వైరల్ అయ్యాయి. డాక్టరేట్ పట్టా, పీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పడం లాంటి వాటితో కౌశల్‌పై నెగెటివ్ ట్రోలింగ్ పెరిగిపోయింది. తాజాగా కౌశల్ సుమ నిర్వహించే ఎఫ్3లో పాల్గొన్నాడు.

ఈ షోలో భాగంగా కౌశల్ గురించి చెబుతూ.. ఆయన సలహాల వల్ల టాప్ మోడల్ అయిపోవచ్చని.. పెద్ద మోడల్ అవ్వాలని తనని ఆశీర్వదంచమని ఫన్నీగా కౌశల్ కాళ్లకు దండం పెట్టింది సుమ. ఆ తర్వాత క్యాట్ వాక్ చేసిన సుమకు కౌశల్ కౌంటర్ వేశాడు. తిప్పాల్సింది నోరు, చేతులు కాదంటూ కౌంటర్ వేయగా.. సుమ కూడా రివర్స్ కౌంటర్ వేసింది. అందుకు సంబంధించిన ప్రోమో క్రింద ఉంది చూడండి. ఇక కౌశల్ ప్రస్తుతం ‘ఆది శంకర వస్తున్నాడు. నన్ను ప్రతి రోజూ పది గంటలకు మిస్ అవకండి’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో కౌశల్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

Loading...