Thursday, March 28, 2024
- Advertisement -

ప్రేమ వివాహ‌మే చేసుకుంటా!

- Advertisement -

మ‌హ‌న‌టి సినిమాతో హీరోయిన్ కీర్తి సురేష్ ద‌క్షిణాదిన మంచి క్రేజ్ సంపాదించుకుంది.కీర్తి మహానటిగా ఒదిగిపోయారన్నది నిజం. అయితే ఈమె ఆ పాత్రలో నటన వెనుక శ్రమ, పట్టుదల, అవమాన భారం, ఎగతాళి, వేదన, కంటతడి, కసి, కృషి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.మ‌హ‌న‌టి గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు..ద‌ర్శ‌కుడు నాగ్‌ అశ్విన్‌ చెప్పిందే చేశాను.

నా న‌ట‌న క్రెడిట్ మొత్తం ద‌ర్శ‌కుడికే ద‌క్కుతుంది.నేను ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్నానని, తెలుగు తమిళ్‌లో మంచి రోల్స్ వ‌స్తున్నాయాని కీర్తి చెప్పుకొచ్చింది.ఇక పెళ్లి ఇప్పుడే చేసుకునే ఉద్దేశం లేద‌ని,మా అమ్మా-నాన్న‌ల‌ది ప్రేమ వివాహమేన‌ని,భ‌విష్య‌త్తులో నా మ‌న‌స్సుకి న‌చ్చిన వ్య‌క్తి ఎదురుప‌డితే త‌ప్ప‌కుండా ప్రేమ వివాహ‌మే చేసుకుంటాన‌ని కీర్తి తెలిపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -