Friday, March 29, 2024
- Advertisement -

నాగ చైతన్య కి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్

- Advertisement -

మొన్నటిదాకా డిజాస్టర్ లతో సతమతమైన అక్కినేని యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే ‘మజిలీ’ సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకటేష్ మరియు నాగచైతన్య హీరోలుగా వస్తున్న ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న చై నాగార్జున తో ‘బంగార్రాజు’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య తో రొమాన్స్ చేయడానికి జంటగా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు. మరోవైపు నాగార్జున కోసం పూజ హెగ్డే వంటి సంప్రదిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్ నాగ చైతన్య కి పెద్ద షాక్ ఇచ్చింది.

కథంతా విన్నాక కీర్తి సురేష్ తన పాత్ర అంతగా బాగోలేదని ఈ సినిమాకి నో చెప్పిందట. అయితే గతంలో ‘మహానటి’ సినిమా లో కీర్తి సురేష్ ఏఎన్నార్ పాత్ర పోషించిన నాగ చైతన్య తో తెరపై కనిపించింది. మరోవైపు నాగార్జున ‘మన్మధుడు 2’ సినిమాలో కూడా కీర్తి సురేష్ గెస్ట్ పాత్రలో కనిపించబోతోంది. కీర్తి సురేష్ నో చెప్పడంతో ‘బంగార్రాజు’ దర్శక నిర్మాతలు ఇప్పుడు నాగ చైతన్య కోసం వేరే హీరోయిన్లను వెతికే పనిలో పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -