పెళ్లి వార్తలపై అసలు విషయం చెప్పిన కీర్తి సురేష్..!

1094
Keerthy Suresh Responds on about Marriage Rumours
Keerthy Suresh Responds on about Marriage Rumours

ఓ రాజకీయ నేపథ్యమున్న వ్యాపారవేత్తతో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి రెడీ అవుతుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు కీర్తి. ఈ సినిమాకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. అయితే గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో మంచి ఫార్మ్ లో ఉన్న కీర్తి అప్పుడే పెళ్లి చేసుకోవడమేంటని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు తన పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ స్పందించింది. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇస్తూ.. మీడియాలో గానీ – సోషల్ మీడియాలో గానీ దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని కీర్తి కోరింది. మరో ఏడాది సినిమాలతోనే బిజీగా ఉంటానని – వచ్చే ఏడాది వరకు కాల్షీట్స్ ఇచ్చానని ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు చేసుకుటానని ప్రశ్నించింది.

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో – హీరోయిన్లపై రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక మొన్న అనుష్క పెళ్లిపై రూమర్లు వచ్చాయి. అనుష్క కూడా ఇవన్ని రూమర్సే అని కొట్టిపరేసింది. ఇప్పుడు కీర్తి కూడా తన పెళ్లి ఇప్పట్లో లేదని రూమర్స్ నమ్మొద్దని చెప్పింది. ఇక ప్రస్తుతం కీర్తి రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాతే’ చిత్రంలోను – కార్తీక్ సుబ్బరాజు ‘పెంగ్విన్’ – మోహన్ లాల్ నటిస్తున్న ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ – తెలుగులో ‘మిస్ ఇండియా’ – గుడ్ లక్ సఖీ – ‘రంగ్ దే’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Loading...