అల్లు అర్జున్ సరసన హాట్ బ్యూటీ

325
Ketika Sharma to Romance Allu Arjun in Trivikram Direction
Ketika Sharma to Romance Allu Arjun in Trivikram Direction

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముచ్చట గా మూడోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జతకట్టనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి అనేక కథనాలు మీడియా లో వచ్చినప్పటికి అల్లు అర్జున్ కేవలం మొదటి షెడ్యుల్ లో మాత్రమే పాలుగొన్నాడు. మొదటి షెడ్యుల్ అయిన వెంటనే స్విట్జర్లాండ్ కు విహార యాత్రకు వెళ్లిన అల్లు అర్జున్ త్వరలో సినిమా కి సంబందించిన కొత్త షెడ్యుల్ లో చేరనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే పురి జగన్నాథ్ కుమారుని రాబోయే సినిమా రొమాంటిక్ లోని హీరోయిన్ గా నటిస్తున్న కేతిక శర్మ ఇప్పుడు అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్నది.

ఇప్పటికే పూజ హెగ్డే ఈ సినిమా లో ప్రధాన హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా చిత్రం లో ఉన్న ఒక ముఖ్య పాత్ర కోసం కేతీక శర్మ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. కేతికా శర్మ కొన్ని ముఖ్యమైన సీన్ల తో ఒక పాట లో కూడా కనిపించనున్నది.

ఈవిడ కూడా త్వరలో మొదలు కానున్న సినిమా కొత్త షెడ్యుల్ లో అల్లు అర్జున్ తో పాటు షూటింగ్ లో పాల్గొననున్నారు. అదే విధంగా ఈ సినిమా లో టబూ ఒక ముఖ్య పాత్ర లో మెరవనున్నది. హారిక అండ్ హాసిని మరియు గీత ఆర్ట్స్ సంయుక్తం గా నిర్మించనున్నారు.

Loading...