బిగ్ బాస్ సీజన్ 3 లో జరిగిన కీలకమైన మార్పులు

2185
Key changes in Bigg Boss Telugu Season 3
Key changes in Bigg Boss Telugu Season 3

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ రేపటి నుంచి మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కింగ్ నాగర్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి, సావిత్రి, జర్నలిస్ట్ జాఫర్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం, రఘు మాస్టర్ తదితరులు పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మొదటి రెండు సీజన్ లతో పోలిస్తే బిగ్ బాస్ 3 విషయంలో కొన్ని పెద్ద మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. అందులో మొదటిది కామనర్స్ ని తీసుకోకపోవడం.

బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లలోనూ ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేని కామన్ పీపుల్ ని కూడా తీసుకున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 3 విషయంలో మాత్రం అసలు కామనర్స్ ని ఎంపిక చేయలేదట. అంతే కాకుండా ఇప్పటి వరకు రెండు సీజన్లలో ఎలిమినేషన్ కోసం గూగుల్ ఓటింగ్ సిస్టం ను వాడారు. కానీ బిగ్ బాస్ సీజన్ 3 కోసం నిర్వాహకులు ఈ సారి హాట్స్టార్ మరియు ఫోన్ లైన్ ఓటింగ్ చేపట్టనున్నారని తెలుస్తోంది. వీటి గురించిన క్లారిటీ రావాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.

Loading...