Friday, March 29, 2024
- Advertisement -

భార్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన కేజీఎఫ్ హీరో

- Advertisement -

గ‌త కొంత‌కాలంగా సినీ ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తోన్న పేరు య‌ష్‌. కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు ఈ క‌న్న‌డ హీరో. అంత‌క ముందు య‌ష్ అనే ఓ హీరో ఉన్నాడ‌ని క‌న్న‌డ ప్రేక్షకుల‌కు త‌ప్ప మ‌రోక‌రికి తెలియ‌దు. కాని కేజీఎఫ్ సినిమాతో నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు య‌ష్‌. ఇంకా చెప్పాలంటే బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ ఎంత‌టి స్టార్‌డ‌మ్‌ను సంపాదించాడో, కేజీఎఫ్‌తో య‌ష్ కూడా అంతే క్రేజ్‌ను సాధించాడు. ఇటీవ‌లే ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది.కేజీఎఫ్ – ఛాప్టర్ 2 విడుద‌లైతే య‌ష్ క్రేజ్ మ‌రింత పెరుగుతుంద‌నడంలో ఎవ‌రికి అనుమానం లేదు.

తాజా య‌ష్ త‌న భార్య గురించి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రేమికుల దినోత్స‌వం నాడు త‌న భార్య రాధిక ఫోటోని షేర్ చేశాడు య‌ష్. మేం పెర్ఫెక్ట్ కపుల్ కాదు. కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,కీచులాడుకుంటాం,అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ వాటి వల్లనే మేం బాగా ఒకరినొకరం అర్థం చేసుకుంటాం. మా మధ్య ప్రేమబంధాన్ని పెంచేది ఇదే అంటూ… ఓ పోస్ట్ పెట్టాడు య‌ష్‌. దీనిని చూసిన చాలామంది య‌ష్‌ను అభినందిస్తున్నారు. ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పి రియ‌ల్ హీరో అనిపించుకున్నావ్ బ్ర‌ద‌ర్ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. య‌ష్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -