కుష్బూ నిన్ను రేప్ చేస్తా.. నటికి ఫోన్ చేసి బెదిరించాడు..!

821
Khushbu Complained to Mamatha benarjee on Thretned calls
Khushbu Complained to Mamatha benarjee on Thretned calls

సీనియర్ నటి కుష్బూ.. అన్ని భాషల్లో మంచి క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో మంచి మంచి సినిమలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా సినిమాల్లో కీలక పాతలు చేస్తూ ఉంటుంది. అయితే రాజకీయాల్లో కూడా ఉన్నారు కుష్బూ. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటమే కాదు.. ప్రజా సమస్యలపై స్పందిస్తుంటుంది. అలాంటి కుష్బూకే ఒకడు షాక్ ఇచ్చాడు.

తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి కుష్బూకు ఫోన్ చేసి రేప్ చేస్తామని.. చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడట. దీంతో ఆగ్రహానికి గురైన కుష్బూ ఏకంగా ఆ ఫోన్ నంబర్ ను సోషల్ మీడియాలో పెట్టేసింది. ట్రూ కాలర్ లో వచ్చిన పేరును బట్టి అడ్రస్ ను బట్టి సదురు వ్యక్తిని ఓ రేంజ్ లో ఆడుకుంది. ఇష్టమొచ్చినట్టు తిట్టింది. ఇలాంటి చిల్లర వేశాలు వేసేవారిని అందరి ముందు కడిగేయాలని.. పబ్లిక్ గా పరువు తీయాలని.. వాడికి కూడా కుటుంబం ఉంటుంది కదా అని ఫైర్ అయ్యింది.

ఈ విషయంను ఇంతటితో వదిలేయకుండా తనను బెదిరించిన వ్యక్తి నంబర్ కోల్ కతాకు చెందినదని గుర్తించింది. వెంటనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేసింది. తనకే ఇలాంటి బెదిరింపులు వస్తే.. ఇక మీ రాష్ట్రంలోని మహిళల పరిస్థితి ఏంటో అని ఆలోచించాలని మమతను చర్య తీసుకోవాలని కుష్బూ వేడుకుంది.

అఖిల్ తో పెళ్లి కావాలంట.. విష్ణుప్రియ కోరిక.. రివీల్ చేసిన శ్రీముఖి..!

బిగ్ బాస్ 4 కోసం పూనమ్‌ బజ్వా ఎంత తీసుకుంటుందో తెలుసా ?

బిగ్ బాస్ 4 రాబోతుంది.. పాల్గోనే 15 మంది సెలబ్రిటీలు వీరే..!

నితిన్ పెళ్లికి పవన్ వెళ్లొద్దు అంటున్న అభిమానులు.. కారణం ?

Loading...