Friday, April 19, 2024
- Advertisement -

అఖిల్ స‌ర‌స‌న‌ కియారా అద్వాని సెట్‌ అవుతుందా…?

- Advertisement -

అఖినేని న‌ట వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్‌. ఎంట్రీ అయితే గ్రాండ్‌గా ఇచ్చిన అఖిల్‌కు హిట్ మాత్రం ద‌క్క‌డం లేదు. అఖిల్ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాల్లో న‌టించాడు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో అఖిల్‌కు హిట్‌ను ఇచ్చే బాధ్య‌త‌లను అల్లు అర‌వింద్‌కు అప్ప‌గించాడు నాగ‌ర్జున. అఖిల్‌కు హిట్ ఇవ్వ‌డం కోసం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ను రంగంలోకి దించాడు అల్లు అర‌వింద్‌. అఖిల్ కోసం బ్ర‌హ్మాండ‌మైన ఫ్యామిలీ ఎమోష‌న్‌ని రెడీ చేశాడ‌ట బొమ్మ‌రిల్లు భాస్క‌ర్.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది, కాని సినిమాలో అఖిల్‌కు హీరోయిన్‌గా చాలామందిని ప‌రిశీలించిన‌ప్ప‌టికి చివ‌రికి బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానినీ ఫిక్స్ చేశార‌ట‌. కియారా తెలుగులో రెండు సినిమాల్లో న‌టించింది. మ‌హేశ్‌తో క‌లిసి భ‌ర‌త్ అను నేను, రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి విన‌య విధేయ రామ సినిమాల్లో హీరోయిన్‌గా క‌నిపించింది కియారా. ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

అయితే అఖిల్ స‌ర‌స‌న కియారా ఎంత వ‌ర‌కు సెట్ అవుతుందో చూడాలి. అఖిల్ హైట్‌కు కియారా హైట్‌కు చాలా తేడా ఉంది. మ‌రి అఖిల్‌కు కియారా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందో చూడాలి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా న‌టిస్తుంది కియారా. ఈ సినిమాతో పాటు మ‌రో రెండు బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -