కియారా అద్వానీ డ్రెస్ పై ఫైర్ అవుతున్న అభిమానులు

514
Kiara Advani's Dress Reminds The Internet Of This Popular Snack
Kiara Advani's Dress Reminds The Internet Of This Popular Snack

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇటు తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకుంది. తాజాగా ఈమె హిందీలో నటించిన ‘కబీర్ సింగ్’ కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ ఫ్యాషన్ సెన్స్ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. కానీ తాజాగా ఈమె వేసుకున్న ఒక అవుట్ ఫిట్ చాలా చెత్తగా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా కియారా అద్వానీ ట్రావెల్ ప్లస్ లీజర్ మేగజైన్ కవర్ పేజ్ పై కనిపించింది. పసుపు రంగు డ్రెస్ లో కీయార చూడటానికి అందంగానే ఉంది కానీ డ్రెస్ బాలేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

కియారా వేసుకున్న డ్రెస్ ఫాబ్రిక్ కంటే మార్కెట్లో బియ్యం బస్తాల కి వాడే మెటీరియల్ బాగుంటుందని కొందరు ఈమెని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కవర్ పేజి పైన కనిపించిందంటే కియారా వేసుకున్నది డిజైనర్ అవుట్ ఫిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ మెటీరియల్ బాలేదని కొందరు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే కియారా అద్వానీ చేతిలో బోలెడు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ సరసన ‘లక్ష్మీ బాంబ్’ మరియు ‘గుడ్ న్యూస్’ సినిమాలో నటిస్తోంది కీయార.

Loading...