మహేష్ హీరోయిన్ కి తెలుగు సినిమాలకు సమయం లేదట

280
Kiara Adwani Have No Time for Telugu Movies
Kiara Adwani Have No Time for Telugu Movies

‘ఎంఎస్ ధోని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ‘భరత్ అనే నేను’ సినిమా తో ఏకంగా మహేష్ బాబు తో రొమాన్స్ చేసే అవకాశాన్ని కొట్టేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. తెలుగులో ఈమె కెరీర్ ఎలా ఉన్నా హిందీ లో మాత్రం వరుస బ్లాక్బస్టర్ సినిమాలతో ముందుకు దూసుకుపోతోంది కియారా అద్వానీ. ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ తోనే పాపులారిటీ సంపాదించిన కియారా అద్వానీ ‘కబీర్ సింగ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకుంది.

ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు ఉండడం ఉండడం విశేషం. ప్రస్తుతం కియారా అద్వానీ కరణ్ జోహార్ బ్యానర్లో అక్షయ్‌ కుమార్‌తో ‘గుడ్‌ న్యూస్‌’, సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘షేర్షా’ సినిమాలు చేస్తోంది. మళ్ళీ అక్షయ్‌ కుమార్‌తోనే కాంచన రీమేక్‌ అయిన ‘లక్ష్మీ బాంబ్‌’ లో కూడా నటిస్తున్న కీయార ‘ఇందు కీ జవానీ’ అనే మరో సినిమాలో కూడా కనిపించనుంది. ఒకవైపు బోల్డ్ పాత్రలు మాత్రమే కాక కమర్షియల్ పాత్రలు కూడా నటించడానికి కీయార ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారిపోయింది. ఈమెను మళ్లీ తెలుగు లోకి తీసుకు వద్దామని కొందరు బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కానీ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తామన్నా కీయార డేట్లు మాత్రం ఖాళీ లేవట.

Loading...