Tuesday, April 16, 2024
- Advertisement -

తెలుగు లో చేయకపోతే కైరా పరిస్థితి అంతే

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో భారీ బడ్జెట్ల తో సినిమా లు వస్తాయి. భారత చలన చిత్రం లో బాలీవుడ్ తర్వాతి స్థానం మన తెలుగు సినిమా పరిశ్రమ కి మాత్రమే ఉంది. అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ కొత్త వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే హీరోయిన్స్ కు తెలుగు పరిశ్రమ బంగారు పళ్లెం అని చెప్పాలి. ఇంకెక్కడా లేనటువంటి పారితోషికం మన తెలుగు లో ఇస్తారు. బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకొని, స్టార్డం సాధిస్తే కానీ పారితోషికం ఎక్కువ ఉండదు. అలాంటిది తెలుగు లో మొదటి సినిమా కి కూడా భారీ ఎత్తున పారితోషికం అందుకున్న వాళ్ళు ఉన్నారు.

ఇకపోతే కైరా అద్వానీ కి బాలీవుడ్ లో ఎం ఎస్ ధోని సినిమా తో బ్రేక్ వచ్చింది కానీ ఆ తర్వాత బాలీవుడ్ లో అంత లా మెరవలేదు. కానీ తెలుగు లో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ తో పాటు తెలుగు సినిమా అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించడం తో కైరా కి ఎనలేని క్రేజ్ వచ్చింది. తెలుగు లో సినిమా చేయడం వలెనే ఇప్పుడు తను భారీ మొత్తం లో డిమాండ్ చేయగలుగుతుంది. ఇదే హిందీ కి పరిమితం అయ్యి ఉంటే ఇలా ఉండేది కాదు అనేది కొంత మంది అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -