Saturday, April 20, 2024
- Advertisement -

మరో నట వారసుడి అరంగేట్రం.

- Advertisement -

కన్నడ చిత్ర పరిశ్రమలో సుదీప్ అంటే తెలియని వారెవరు వుండరు. కిచ్చా సుదీప్ గా అందరికీ సుపరిచితుడైన ఈ నటుడు తెలుగు లో కూడా అందరికీ పరిచయమే. ఈగ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సుదీప్ ఆ తరువాత బాహుబలి చిత్రం లో ఓ ముఖ్య పాత్ర చేశాడు. అంతే కాకుండా అతని చాలా కన్నడ సినిమాలు తెలుగు లోకి డబ్ చేయబడ్డాయి. ఇప్పుడు తాజా గా ఆయిన మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సైరా నరసింహ రెడ్డి లో ఒక ముఖ్య పాత్ర చేయనున్నాడు.

తాజా సమాచారం మేరకు సుదీప్ యొక్క మేనల్లుడు సంచిత్ సంజీవ్ త్వరలో నటుడిగా ఆరంగెట్రం చేయనున్నాడు. ఇప్పటికే ఫిలిమ్ మేకర్ గా తన సత్తా చాటిన సంచిత్ సంజీవ్ త్వరలో నటుడిగా రాణించాలనే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు.

సుదీప్ యొక్క పర్యవేక్షణ లో సంచిత్ సంజీవ్ ముంబై లో నటుడిగా శిక్షణ తీసుకున్నట్టు గా తెలుస్తుంది. సంచిత్ సంజీవ్ ప్రధాన పాత్ర లో వచ్చే సినిమా కి సంబందించిన మిగిలిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇప్పటికే కన్నడ పరిశ్రమ లో చాలా మంది ఎస్టేబ్లిష్డ ఫ్యామిలీస్ నుండి వచ్చిన నటులు ఎంతో విజయం సాధించారు. ఇప్పుడు సంచిత్ సంజీవ్ ఏం చేయనున్నాడు మనం వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -