Friday, March 29, 2024
- Advertisement -

మూవీ రివ్యూ: కొబ్బరి మట్ట సమీక్ష

- Advertisement -

సినిమా: కొబ్బరి మట్ట
విడుదల తేదీ : ఆగస్టు 10, 2019
నటీనటులు : సంపూర్ణేష్ బాబు,ఇషికా సింగ్,షకీలా,మహేష్ కత్తి
దర్శకత్వం : రోనాల్డ్ రూపక్ సన్
నిర్మాత‌లు : సాయి రాజేష్ నీలం
సంగీతం : సయీద్ కమ్రాన్
సినిమాటోగ్రఫర్ : ముజీర్ మాలిక్
ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్

కథ:
రాయుడు (సంపూర్ణేష్ బాబు) ఒక ఊరి పెద్ద. అతను తన ముగ్గురు భార్యల తో కలిసి జీవిస్తూ ఉంటాడు. అలా సాఫీగా సాగిపోతున్న జీవితం లోకి సడన్ గా ఆండ్రాయియుడు (సంపూర్ణేష్) వస్తాడు. రావడం రావడం తో నే రాయుడు కి కష్టాలని తీసుకొస్తాడు. ఈ రాయుడు ఎవరు? ఆండ్రాయుడు కి తనకి ఏంటి సంబంధం? అసలు కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది థియేటర్ల లో చూడాలి.

నటీనటులు పనితీరు:
సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్లు గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా సంపూర్ణేష్ బాబు నటన గురించి మాట్లాడుకోవచ్చు. నటనతో, డైలాగు డెలివరీ తో కామెడీ పుట్టించగల నటులున్నారు కానీ యాక్షన్ సన్నివేశాలు, డాన్సులతో కూడా కామెడీ సృష్టించగల హీరో సంపూర్ణేష్ బాబు. సినిమాలో పెద్దరాయుడు పాత్రలో సంపూర్ణేష్ బాబు నటన చాలా బాగుంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ కథలో సంపూర్ణేష్ బాబు తన పాత్రలో పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ పాత్రలో సంపూర్ణేష్ నటన మరియు ఎనర్జీ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఇషిక సింగ్ పెద్దగా పర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినా తనకున్న తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది. తన అందంతో మాత్రమే కాకుండా అభినయంతో కూడా ఇషిక ప్రేక్షకులను మెప్పిస్తుంది. షకీలా కి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఆమె తన పాత్రకు తన పాత్రలో ఒదిగిపోయి చాలా సహజంగా నటించింది. గాయత్రీ గుప్త కూడా తన పాత్రలో చాలా బాగా నటించింది.

సాంకేతిక వర్గం పనితనం:
సినిమాలో పెద్దగా కథ అంటూ లేకపోయినప్పటికీ దర్శకుడు రూపక్ రోనల్డ్సన్ కేవలం ఎంటర్టైన్మెంట్, కామెడీ తో సినిమా మొత్తం నడపడానికి ప్రయత్నించాడు. చిన్ని కథలో బోలెడంత ఎంటర్టైన్మెంట్ నింపి దర్శకుడు కథను నెరేట్ చేసిన విధానం బాగుంది. స్టీవెన్ శంకర్ అందించిన కథ మరియు స్క్రీన్ ప్లే గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినప్పటికీ ఆయన అందించిన డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. ముఖ్యంగా మూడున్నర నిమిషాలపాటు ఉండే సింగల్ షార్ట్ డైలాగ్ చాలా బాగుంది. నిర్మాతలు సాయి రాజేష్ నీలం మరియు ఆది కుంభ గిరి అందించిన నిర్మాణ విలువలు సినిమాకి చాలా బాగా సహాయపడ్డాయి. కమ్రాన్ సంగీతం చాలా బాగుంది. పాటలు మరియు కమ్రాన్ అందించిన సంగీతం సినిమాకి చాలా బాగా సెట్ అయింది. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సన్నివేశాల చిత్రీకరణ చాలా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
సినిమాలో బలమైన కథ లేకపోయినప్పటికీ ఆద్యంతం వినోదాత్మకంగా సాగడంతో పరవాలేదనిపిస్తుంది. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం కామెడీ తో నిండి ఉంటుంది. సంపూర్ణేష్ బాబు పంచ్ డైలాగులు, నటన కామెడీని చాలా బాగా జనరేట్ చేస్తాయి. రెండవ హాఫ్ లో కూడా భారీ డైలాగులతో సంపూర్ణేష్ బాబు బాగానే ఆకట్టుకున్నాడు. సంపూర్ణేష్ బాబు నటన, సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అయితే బలమైన కథ లేకపోవడం సినిమాకి మైనస్ పాయింట్ గా మారింది. అక్కడక్కడ దర్శకుడు కథలో లాజిక్ కూడా మిస్ అవుతూ ఉండడంతో ప్రేక్షకులకు కూడా సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. అయినప్పటికీ కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగా ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులకు అంతగా బోర్ అనిపించదు. లాజిక్ లేకుండా కేవలం కామెడీని ఇష్టపడే వారు ఈ సినిమాని హ్యాపీగా చూసేయచ్చు కానీ మిగతా వారికి సినిమా అంతగా నచ్చకపోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -