Wednesday, April 24, 2024
- Advertisement -

కౌసల్య కృష్ణమూర్తి రివ్యూ

- Advertisement -

తమిళం లో కనా అనే పేరు తో ఒక సినిమా ఈ ఏడాది విడుదల అయింది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. అదే సినిమా ని, అదే హీరోయిన్ తో తెలుగు లో కౌసల్య కృష్ణమూర్తి అనే పేరు తో రీమేక్ చేశారు. కె ఎస్ రామారావు నిర్మాణం లో, క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ సంస్థ పై, రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్ర పోషించగా, తమిళ హీరో శివ కార్తికేయన్ ఒక స్పెషల్ రోల్ లో చేశారు. ఈ సినిమా నేడు విడుదల అయింది. ఈ సినిమా సమీక్ష విషయాన్ని వస్తే,

కథ: ఒక పల్లెటూరు లో సాదా సీదా రైతు కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్). ఆయన కూతురు కౌసల్య (ఐశ్వర్య) ఒక పెద్ద అంతర్జాతీయ క్రికెటర్ అవ్వాలి అనే కలలు కంటూ ఉంటుంది. తాను పెరిగిన పరిస్థితులు, వాతావరణం, ఆర్ధిక స్థితి తన కలలని సహకరించే క్రమం లో ఉండవు. అయినప్పటికీ ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని తన కల ని ఎలా నిజం చేసుకుంది? చివరికి క్రికెటర్ ఎలా అయింది? ఈ దారి లో తనకి వచ్చిన అడ్డంకులు ఏంటి? అనేది ఈ సినిమా కథ.

నటీనటులు: ఐశ్వర్య రాజేష్ నటన సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మంచి పాత్రను దక్కించుకోవడమే కాక తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కూడా తన పాత్రకు ఊపిరిపోశారు. శివ కార్తికేయన్ తెరపై కనిపించింది కాసేపు అయినప్పటికీ అద్భుతంగా నటించారు. శివ కార్తికేయన్ నటన ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్. కార్తిక రాజు తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. ఝాన్సీ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. సి వి ఎల్ నరసింహారావు చాలా బాగా నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అభిమానులను ప్రేక్షకులను ఖచ్చితంగా నవ్విస్తుంది. రవిప్రకాష్ నటన బాగుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం: అరుణ్ రాజా కామరాజ్ ఈ సినిమా కోసం ఒక మంచి కథను అందించారు. అయితే దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఈ కథను తెరకెక్కించే ప్రయత్నం బాగానే అనిపించినప్పటికీ సినిమాలో కొన్ని సాగతీత సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. కథ బాగానే ఉన్నప్పటికీ దర్శకుడు నెరేట్ చేసే విధానం కొంచెం స్లో గా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు అంత త్వరగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. కె ఏ వల్లభ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దిబు నినన్ థామస్ అందించిన సంగీతం సినిమా లో హైలైట్ గా మారింది. కేవలం పాటలు మాత్రమే కాక దిబు అందించిన నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఐ ఆండ్రూ అందించిన విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. హనుమాన్ చౌదరి రాసిన డైలాగులు కూడా సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు: సినిమాకి మంచి కథ ఉన్నప్పటికీ దర్శకుడు ఆ కథని నెరేట్ చేసే విధానం బాగా స్లోగా ఉండటం కొందరు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కి సరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. ఇక మొదటి హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ లో కథ లో కొన్ని మలుపులు ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. నటినటులు, కథ, మరియు సంగీతం మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు గా చెప్పుకోవచ్చు. కొన్ని సాగతీత సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకి మైనస్ పాయింట్లుగా మారాయి. రెండవ హాఫ్ లో ఎమోషన్స్ ను చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. చివరగా ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే మెప్పించగలిగే ఒక మంచి సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -