ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన కృష్ణ రాజు భార్య..!

9293
Krishnam Raju Wife Shyamala Devi About Prabhas
Krishnam Raju Wife Shyamala Devi About Prabhas

టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఎచ్చుకున్నారు రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు. అలానే ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది. ఆయన విజయం వెనుక ఆయన భార్య శ్యామలాదేవి గారి పాత్ర కూడా చాలా ఉంది. ఇటివలే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్ గురించి, కృష్ణరాజు గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుని పెద్ద బాజీ అని పిలుస్తాడని.. తనను కన్నమ్మ అని ప్రేమగా పిలుస్తాడని ఆమె చెప్పింది. మా ఫోన్ నెంబర్లు కూడా అతని ఫోన్ లో ఈ పేర్లతోనే ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రభాస్ అంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టమని చెప్పారు. ఇక ప్రభాస్ కి కూడా వాళ్ల పెద్దనాన్న అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇక కృష్ణంరాజు గారు నిరంతరం సినిమాలు తీయాలని తపిస్తారని, రిటైర్ మెంట్ అనేది ఒప్పుకోరని శ్యామలాదేవి అంటున్నారు.

అంతేకాదు , కృష్ణంరాజు ఓ మాట చెబితే దాన్ని తిరస్కరించే సాహసం ప్రభాస్ చేయలేడని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇక తనకున్న ముగ్గురు కూతుళ్లతో కూడా ప్రభాస్ చాలా ప్రేమగా ఉంటాడని.. సొంత చెల్లెళ్ళ కన్నా ఎక్కువగా చూస్తాడని శ్యామాలాదేవి చెప్పారు. ఇక 40 ఏళ్ల వచ్చిన ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడంపై.. పెళ్లి గురించి రకరకాల వార్తలు రావడం నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ప్రభాస్ పెళ్లి జాన్ మూవీ తర్వాత ఖాయంగా ఉంటుందని చెప్పారు.

Loading...