ఎన్టీఆర్‌ ఖుష్బూ కి ఎంత ఇష్టమో తెలుసా ?

5931
Kushboo Favorite Actor In Tollywood Is Jr NTR
Kushboo Favorite Actor In Tollywood Is Jr NTR

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఎత్తున ఈయన ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు.అద్బుతమైన నటన మరియు మంచి మనసున్న వ్యక్తిగా ఎన్టీఆర్‌ను అంతా కూడా అభిమానిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ ను అభిమానించే వారిలో సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. కోలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరోయిన్ ఖుష్బూ తనకు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంను చెప్పింది.

ఓ ఇంటర్వ్యూళో ఖుష్భూ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని.. ఆయన్ను ఎంత పిచ్చిగా అభిమానిస్తానో నాకే తెలుసు. ఆయన ప్రతి సినిమాను చిన్నపిల్లాడిలా ఫస్ట్ రోజే చూసేందుకు ఆసక్తి చూపుతాను. సినిమా చూస్తూ విజిల్స్ వేస్తాను. కాగితాలు చించుతాను. చప్పట్లు కొడుతూ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తాను అంటూ ఖుష్బూ చెప్పింది. నాకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టామో ఆయనకే చెప్పాను.

ఆ టైంలో అతని దగ్గర ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ పై అభిమానంతో యమదొంగ సినిమాలో నటించాను. ఆ సినిమాలో ఆయన పక్కన స్క్రీన్ ప్రజెన్స్ దక్కలేదు. త్వరలోనే ఆయన సినిమాలో మంచి క్యారెక్టర్ రోల్ చేయాలని కోరుకుంటున్నట్లు ఖుష్భూ తెలిపింది. ఖుష్భు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అంతటి హీరోయిన్ కి ఎన్టీఆర్ పై అభిమానం కలిగి ఉండటం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

Loading...