Friday, March 29, 2024
- Advertisement -

యూట్యూబ్‌లో ర‌చ్చ చేస్తోన్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్‌

- Advertisement -

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మి పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన దగ్గ‌ర నుంచి ఈ సినిమాను తీశాడు వ‌ర్మ‌. ఇటీవ‌లే ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ మొత్తం చంద్ర‌బాబునే టార్గెట్ చేశాడు వ‌ర్మ‌. తాజాగా ఈ ట్రైల‌ర్ కోటి వ్యూస్ దాటింద‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. సినిమాలో కంటెంట్, తన ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకువెళ్లడంలో వర్మ సక్సెస్ అవుతున్నాడనే చెప్పాలి.

ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా వర్మ విడుదల చేసిన ఈ ట్రైలర్ కి ఇప్పటివరకు కోటి వ్యూస్ వచ్చాయి. సినిమాకు ప‌బ్లిసిటి చేయాలో వ‌ర్మ‌ను చూసు నేర్చుకోవాలి. సినిమాలో మ్యాట‌ర్ లేక‌పోయిన , ఆ సినిమాను జ‌ననాల‌లోకి తీస‌కువెళ్ల‌డంలో వ‌ర్మ త‌రువాతే ఎవ‌రైనా. ప్ర‌స్తుతానికి అయితే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. మ‌రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ న‌టించి , నిర్మించిన మ‌హ‌నాయ‌కుడు ట్రైల‌ర్ కూడా నిన్న‌నే(శ‌నివారం) విడుద‌లైంది. మ‌రి ఈ ట్రైల‌ర్ ఎన్ని వ్యూస్ సాధిస్తుందో చూడాలి. మ‌హనాయ‌కుడు విడుద‌ల అయిన త‌రువాతే త‌న సినిమాను విడుద‌ల చేస్తాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -