అప్పడు గతిలేక అక్కడే బట్టలు మార్చుకునేదాన్ని : లావణ్య త్రిపాఠి

1108
lavanya tripathi reveals shocking incident about her life
lavanya tripathi reveals shocking incident about her life

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఫస్ట్ మూవీతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికి ఈమెకు మాత్రం వరుస అవకాశాలు వచ్చాయి.

’దూసుకెళ్తా’ ’‘భలె భలె మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి హిట్లు అందుకుని ఫుల్ ఫామ్లోకి వచ్చిన తరుణంలో ‘మిస్టర్’ ‘యుద్ధం శరణం’ ‘అంతరిక్షం’ వంటి సినిమాలతో ఈమె వెనక్కి నెట్టేశాయి. అయితే మళ్లీ ’అర్జున్ సురవరం’ సినిమాతో హిట్ అందుకుని అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ.. పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘విరూపాక్షి’ లో కూడా హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. అయితే దీని పై క్లారిటీ రాలేదు. ఇది ఇలా ఉంటే ఇటీవలే అభిమానులతో ముచ్చటించిన లావణ్య.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చింది.

సినీ ఇండస్ట్రీలో మీ ప్రయాణంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా ? అని అడిగాడు. అందుకు లావణ్య జవాబు ఇస్తూ.. “నేను సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కార్ వ్యాన్లు ఉండేవి కాదు.. దాంతో ప్రొడక్షన్ వ్యాన్ లోనే బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది. దానిని ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడైతే కార్ వ్యాన్ లు అందుబాటులో ఉన్నాయి” అంటూ తెలిపింది. ’అందాల రాక్షసి’ సినిమా కంటే ముందు లావణ్య కొన్ని హిందీ టీవీ సిరీస్ లో కూడా నటించింది.

Loading...