Friday, March 29, 2024
- Advertisement -

లారెన్స్ ‘కాంచ‌న -3’ టీజ‌ర్‌

- Advertisement -

ప్ర‌భుదేవా త‌రువాత అంత‌టి పేరు తెచ్చుకున్నా డ్యాన్స్ మాస్ట‌ర్ ఎవ‌రైన ఉన్న‌రంటే అది ఖ‌చ్చితంగా రాఘ‌వ లారెన్స్ అనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్‌లో గ్రూప్ డ్యాన్స‌ర్‌గా త‌రువాత డ్యాన్స్ మాస్ట‌ర్‌గా , ఆ త‌రువాత సంగీత ద‌ర్శ‌కుడుగా, ద‌ర్శ‌కుడిగా ఇలా త‌న‌లోని టాలెంట్‌ను బ‌య‌టికి తీసి టాప్ పొజిష‌న్‌లో ఉన్నాడు. లారెన్స్ ఎన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ప్ప‌టికి కాంచ‌న సిరీస్‌ను మాత్రం వ‌దిలి పెట్ట‌డు. ఎందుకంటే లారెన్స్‌ను హీరోగా, ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టిన సినిమా ఇది. ఇప్ప‌టికే కాంచ‌న నుంచి రెండు సినిమాల‌ను విడుద‌ల చేసిన లారెన్స్‌, తాజాగా మూడో సినిమాను విడుద‌ల‌కు రెడీ చేశాడు.

కాంచ‌న -3 పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ట్రైల‌ర్ కొద్దిసేప‌టి క్రిత‌మే తెలుగులో విడుద‌ల చేశారు. లారెన్స్ గ‌త సినిమాల మాదిరిగానే హార్ర‌ర్‌, కామెడీ, ఫిక్ష‌న్ ప్ర‌ధానంగా ఈ సినిమాను కూడా తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తుంటే అర్థం అవుతోంది. అయితే ఈ సినిమాలో లారెన్స్ కాస్తా వ‌య‌స్సు మ‌ళ్లిన పాత్రలో క‌నిపిస్తున్నాడు. కాంచ‌నా సినిమాలకు మాదిరిగానే ఈ సినిమా కూడా గ‌త జ‌న్మ ఆధారంగా తీసిన‌ట్లు ఉన్నారు.ఈ సినిమాలో గ్రాఫిక్స్ అధికంగా వాడిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తుంటే ఇట్టే అర్ధం అవుతోంది. ట్రైల‌ర్ లో వేగంగా దూసుకువ‌చ్చే ఎద్దులు ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇక టీజ‌ర్ చివ‌ర్లో లారెన్స్ చెప్పే నువ్వు మాస్ అయితే నేను డ‌బుల్ మాస్, నిప్పును అయిన ట‌చ్ చేయొచ్చు కాని , న‌లుపును ట‌చ్ చేస్తే మ‌టాష్ అంటూ లారెన్స్ చెప్పే డైలాగులు ఆక‌ట్టుకున్నాయి.

మొత్త‌నికి ట్రైల‌ర్ ను చూస్తుంటే లారెన్స్ గ‌త సినిమాల మాదిరిగానే ఉంది.ట్రైల‌ర్ లో కొత్తద‌నం లేక‌పోవ‌డం అభిమానులు కాస్తా నిరాశ‌కు గురి చేసిందనే చెప్పాలి. మ‌రి సినిమాలో అయిన లారెన్స్ కొత్తద‌నం చూపించారేమో చూడాలి అంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. ముని సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన వేదిక ఈ సినిమాలో మ‌రోసారి హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాను తెలుగులో బి.మ‌ధు విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -