Tuesday, March 19, 2024
- Advertisement -

హర్ట్ అయిన లారెన్స్, అక్షయ్ సినిమా నుండి వాకౌట్

- Advertisement -

తెలుగు తమిళ భాషల్లో అత్యంత పెద్ద విజయం సాధించిన చిత్రం కాంచన. రాఘవ లారెన్స్ నటుడిగా దర్శకుడిగా చేసిన ఈ ప్రయత్నాన్ని అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా తరువాత కాంచన సీరీస్ లో మరో రెండు బాగా లు వచ్చినప్పటికీ కాంచన సినిమా కి ఉన్నటువంటి అభిమానులు మరే పార్ట్ కి లేరు.

తాజా ఫిలిమ్ నగర్ కబుర్ల ప్రకారం ఇప్పుడు కాంచన సినిమా హిందీ లో రీమేక్ అవ్వబోతుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషించడానికి ముందుకు రాగా హిందీ లో కూడా రాఘవ లారెన్స్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తాడు అని ప్రకటన చేశారు.

ఇప్పుడు ప్రాజెక్ట్ నుండి వైదొలగి లారెన్స్ పెద్ద షాక్ ఇచ్చాడు.

తాజా గా రిలీజ్ చేసిన అధికారిక ప్రకటన లో రాఘవ లారెన్స్ తను డబ్బుకి, పేరుకి కన్న తన ఆత్మాభిమానాని కి ఎక్కువ గౌరవం ఇస్తాను అని చెప్తూ తనకి తెలియకుండానే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు అని ఇది దర్శకుడిగా తనని ఎంతో బాధించింది అని అందుకే ఈ సినిమా నుండి వైదొలుగుతున్నట్టు రాఘవ లారెన్స్ తెలిపాడు.

మరి కొద్ది రోజుల్లో అక్షయ్ కుమార్ ని కలిసి తన స్క్రిప్ట్ ని అక్షయ్ కుమార్ కి అందజేస్తానని లారెన్స్ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -