బిగ్ బాస్ 3 లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్ల జాబితా

346
List of contendates who will be participating in Bigg Boss 3 Telugu season
List of contendates who will be participating in Bigg Boss 3 Telugu season

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో తో పోస్ట్ గా మారిన కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక బిగ్బాస్ సీజన్ 3 లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్ ల గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. తాజాగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల లిస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ లిస్టు ప్రకారం బిగ్ బాస్ 3 హౌస్ లోకి వెళ్లబోయే పార్టిసిపెంట్స్ వీళ్లే..

హీరో వరుణ్ సందేశ్:

‘కొత్త బంగారులోకం’, ‘హ్యాపీడేస్’ వంటి సినిమాల్లో నటించిన వరుణ్ సందేశ్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్యనే ‘నువ్వు తోపురా’ సినిమాలో కీలక పాత్ర పోషించిన వరుణ్ సందేశ్ ఇప్పుడు ప్రేక్షకులకు మరింత దగ్గరవడం కోసం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవబోతున్నాడని సమాచారం అందుతోంది.

నటి హేమ:

టాలీవుడ్ లో ఉన్న ఫిమేల్ కమెడియన్స్ లో హేమ పేరు ముందే ఉంటుంది. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా నవ్వించే హేమ అ కూడా ఇప్పుడు బిగ్ బాస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ యాంకర్ శ్రీముఖి:

‘పటాస్’ టీవీ షో తో పాపులర్ అయిన శ్రీముఖి కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలలో కూడా నటించింది. యాంకర్ గా బాగానే పాపులర్ అయిన శ్రీముఖి నటిగా మాత్రం మంచి పేరు తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ లోకి రాబోతోందట.

హిమజ:

టీవీ ప్రేక్షకులకు హిమజ బాగా తెలిసిన అమ్మాయి. మహేష్ బాబు ‘స్పైడర్’, రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’, శర్వానంద్ ‘శతమానంభవతి’ వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈమె జీతెలుగు ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ తో పాపులర్ అయింది.

యాంకర్ సావిత్రి:

బిత్తిరి సత్తి తో కలిసి v6 ఛానల్ లో వచ్చే తీన్మార్ ప్రోగ్రాం లో చేసే సావిత్రి టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. తన తెలంగాణ యాస కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు.

ప్రస్తుతానికి వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. మిగతా వాళ్ల పేర్లు త్వరలో బయటకు రానున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 3 ఈ నెల 21 నుంచి మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే.

Loading...