న‌రేశ్‌పై కోర్టుకు వెళ్తానంటున్న శివాజీ రాజా

180
Maa Association: Naresh Vs Sivaji Raja
Maa Association: Naresh Vs Sivaji Raja

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పోయిన ఆదివారం జ‌రిగాయి. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఏమాత్రం తీసిపోకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో న‌రేశ్‌, శివాజీ రాజాలు పోటీ ప‌డ్డారు. వీరిద్ద‌రు ఒక‌రిపై మ‌రోక‌రు విమ‌ర్శ‌లు చేసుకుని మ‌రి ఈ ఎన్నిక‌ల‌ను మంచి ర‌స‌వ‌త్త‌రంగా మార్చారు. న‌రేశ్‌, శివాజీ రాజాలు మీడియాకెక్కి మ‌రి విమ‌ర్శ‌లు చేసుకున్నారు. గ‌తంలో ఎప్పుడు లేని విధాంగా ఈ సారి రికార్డు స్థాయిలో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో శివాజీ రాజాపై న‌రేశ్ దాదాపు 68 ఓట్లు తేడాతో విజ‌యం సాధించారు. విజ‌యం సాధించిన అనంతరం న‌రేశ్ శివాజీ రాజాతో క‌లిసి ప‌ని చేస్తాన‌ని చెప్పి , మేం అంద‌రం ఒక్క‌టే అని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే వీరిద్ద‌రు మ‌ధ్య వివాదం ఇంకా కొన‌సాగుతునే ఉంది. నరేష్ ప్యానెల్ ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం పెట్టుకుంది. అయితే శివాజీరాజ మాత్రం తమకు మార్చి 31వరకు గడువు ఉందని, అది కాదని ముందుకు వెళితే కోర్టుకి వెళ్తామని అంటున్నట్లు శివాజీరాజ మీడియా ముందు వెల్లడించారు. దీనిపై న‌రేశ్ మీడియాతో మాట్లాడుతు త‌న‌కు ప‌ద‌వి పిచ్చి లేద‌ని , తాము ఎన్నికల్లో గెలిచిన‌ప్ప‌టికి బాధ్యతలు స్వీకరించే హక్కు మాకు ఇవ్వ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. దీనిపై ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద‌ల‌తో చ‌ర్చించి త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు న‌రేశ్‌.