Wednesday, April 17, 2024
- Advertisement -

‘మా’ అధ్య‌క్షుడిగా నరేశ్ ఘ‌న‌విజ‌యం

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. సార్వత్రిక ఎన్నిక‌లు జరిగినట్లుగా మా అధ్యక్ష ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈసారి మా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం శివాజీ రాజాతో న‌టుడు న‌రేశ్ పోటీ ప‌డ్డారు. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం వీరిద్ద‌రు చేయని ప్ర‌య‌త్నలు లేవు. నరేష్ ప్యానెల్ తరఫున జీవిత, రాజశేఖర్ లు కీలక పదవుల కోసం పోటీ పడ్డారు. శివాజీ రాజా ప్యానెల్ తరఫున శ్రీకాంత్‌,ఎస్వీ కృష్ణారెడ్డి వంటివారు పోటీ ప‌డ్డారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలుగా కాగా,మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ‘మా’లో మొత్తం 800 ఓట్లు ఉండ‌గా, ఎప్పుడు లేనంత‌గా ఈసారి అత్య‌ధిక ఓట్లు పోల్ కావ‌డం గామ‌న‌ర్హం. అయితే ఈ ఎన్నిక‌ల్లో అంద‌రు మ‌ళ్లీ శివాజీ రాజానే గెలుస్తాడ‌ని భావించారు. కాని అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తు న‌టుడు న‌రేశ్ విజ‌యం సాధించారు.

శివాజీరాజాకి 199 ఓట్లు పోల్ కాగా, నరేష్ కి 268 ఓట్లు పోలయ్యాయి. దీంతో శివాజీ రాజాపై 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందారు. ఎన్నిక‌లు ఫ‌లితాలు సోమవారం తెల్లవారుజామున వెల్ల‌డించారు. జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌లు విజ‌యం సాధించారు. న‌టి హేమ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కూడా విజ‌యం సాధించారు. ఆమె ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, , కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజ‌యం సాధించారు. అలీ, రవిప్రకాశ్‌, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, ఉత్తేజ్‌, పృథ్వి, జాకీ, సురేశ్‌ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్‌, సమీర్‌, ఏడిద శ్రీరామ్‌, రాజా రవీంద్ర, తనీష్‌, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్‌, పసునూరి శ్రీనివాస్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నిక అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -