ఎన్టీఆర్ సినిమా వదిలేసా.. పవన్ తో ఆ రోజు అలా చేస్తా : మాధవి లత

1285
maadhavi latha shocking comments on pawan kalyan
maadhavi latha shocking comments on pawan kalyan

రవిబాబు దర్శకత్వంలో తనీష్ హీరోగా నటించిన ‘నచ్చావులే’ సినిమా ద్వారా మాధవి హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే ఈ సినిమా కంటే ముందే మహేష్ ‘అతిథి’లో ఓ చిన్న పాత్ర పోషించింది. నచ్చావులే తర్వాత నాని స్నేహితుడా లో నటించింది. తర్వాత ‘అరవింద్ 2′ మినహా ఏ సినిమా రిలీజ్ కాలేదు. 2015లో తమిళంలో వచ్చిన ‘అంబాల’ తర్వాత మాధవి లత సినిమాల్లో నటించలేదు.

అయినప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటోంది. అలాగే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. గత ఎన్నికలకు ముందు బీజీపీలో చేరింది. పోటీ కూడా చేసింది. సొంత జిల్లా నుంచే బరిలోకి దిగినప్పటికీ మాధవి లత ఓడిపోయింది. సినిమాలకు దూరమైనప్పటికీ.. మాధవి లత తరచూ ఏదో ఒక విషయంతో ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాకు ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’లో ఆయన చెల్లి పాత్ర ఆఫర్ వచ్చింది. స్టార్ హీరోతో చెల్లిగా చేయడం ఇష్టం లేక దాన్ని వదులుకున్నా’ అని చెప్పుకొచ్చింది. చాలా రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తోంది మాధవి. ఇక, ఈ ఇంటర్వ్యూలో ఆయన గురించి చెబుతూ.. ‘పవన్ మీద పదిహేనేళ్లుగా క్రష్ ఉంది. ఆయనను ఇప్పటి వరకు కలవలేదు. కలిసే రోజు వస్తే స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తా. ఆరోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నా’ అని మాధవిలత చెప్పింది.

Loading...