Saturday, April 20, 2024
- Advertisement -

పడక గదిలో కెమెరాలు పెడుతారా ?.. ఇత్తడయిపోద్ది : మాధవీలత

- Advertisement -

మాధవీలత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనను ఎవరైన ట్రోల్ చేస్తే వారికి తిరిగి కౌంటర్లు ఇస్తోంది. అందుకే తన జోలీకి ఎవరు రావొద్దని వార్నింగ్ ఇచ్చేసింది. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. గత కొంత కాలంగా బీజీపీ నేతలతో పాటు, పలువురు నెటిజన్లు మాధవీలతను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇండియాలో పదవులు రావాలంటే టాలెంట్ అక్కర్లేదని, గొప్ప వాళ్లతో పరిచయాలు, రికమండేషన్స్ ఉంటే చాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మాధవీలత.. తాజాగా అందరికీ దిమ్మతిరిగే వ్యాసం రాసి పోస్ట్ చేసింది.

” నేను పార్టీ‌లో చేరినపుడు ఏ మాట అయితే చెప్పానో.. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. అది నా పార్టీ అయినా సరే.. తప్పు చేస్తే తప్పే వెంటనే చెప్పేస్తా. నన్ను పార్టీ నుంచి దూరం పెడతారు అనే భయం లేదు. దూరమవుతా అనే బెంగ కూడా లేదు. నేనెపుడు దేశం కోసం ధర్మం కోసం పని చేస్తాను కానీ మనుషుల కోసం వత్తాసుల కోసం కాదు. సమయం సందర్భం చూసి ఎవరు ఎక్కడ రాజకీయ కుట్రలు చేస్తున్నారో చెబుతా. మోడీజీ స్టైల్‌లో పేరు చెప్పను కానీ ఎదుటోడికి తెలిసిపోద్ది ఇత్తడైపోద్ది. ఇది పగ కాదు ప్రతీకారం కాదు.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి బాధ్యతారాహిత్యంగా ఉండటం తప్పు.

తమ సొంత అవసరాలకి ఆబ్లిగేషన్స్‌కి లొంగటం తప్పు. నేను ప్రజల కోసం పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఎవరికీ బానిసని కాను ఊడిగం చేయను. అడుక్కోను. ఆ అవసరం నాకు లేదు. సినిమా రంగంలో సమస్యలు తెలిసే వచ్చా. పోరాడే తెలివి ఉంది కనుక అలాగే బతికా.. రాజకీయంలో చదరంగం తెలిసి ఉండాలి. నాకు అంతగా రాకపోయినా తెగించి వచ్చా. ఎవరికీ భయపడను. ఎవరికీ నన్ను ప్రశ్నించే హక్కు లేదు. పార్టీ ఎప్పటికి మంచిదే కానీ మనుషులంతా మంచోళ్ళా అంటే ఎప్పటికీ కాదు అనే అంటాను. మాట మార్చేదే లేదు. నేనింతే మీకు ముక్కు సూటిగా మాట్లాడతా.

నా వ్యక్తిగత జీవితం ఎవరికైనా అనవసరం పక్కవాళ్ళ జీవితంలో వేలు పెట్టడం సంస్కార హీనం. సోషల్ మీడియా సైకోలకి చెప్తున్నా.. మీ అమ్మ నాన్న నేర్పించలేదేమో పక్కవాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం అంటే అది నీచం, ఛండాలం అది క్రైమ్ అని. నా పడక గదిలో కెమెరాలు పెడతాం ఫేస్‌బుక్‌లో దూరి తిడతాం అంటే ఇత్తడయిపోద్ది. పక్కవారి మంచి కోరుకుంటే మీరు బాగుంటారు. కాదు పరాయివల్ల నాశనం కోరుకుంటే ఎప్పటికీ దిగజారుడు బతుకుగానే ఉంటుంది. ఒకరిని సంతోష పెట్టకపోయినా పరవాలేదు బాధ పెట్టొద్దు ఎవరి అశాంతికి కారణం కావొద్దు” అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది మాధవీలత. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్టీ ఎప్పటికి మంచిదే కానీ మనుషులంతా మంచోళ్ళా అంటే ఎప్పటికీ కాదు అనే అంటాను.

మాట మార్చేదే లేదు. నేనింతే మీకు ముక్కు సూటిగా మాట్లాడతా. నా వ్యక్తిగత జీవితం ఎవరికైనా అనవసరం పక్కవాళ్ళ జీవితంలో వేలు పెట్టడం సంస్కార హీనం. సోషల్ మీడియా సైకోలకి చెప్తున్నా.. మీ అమ్మ నాన్న నేర్పించలేదేమో పక్కవాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం అంటే అది నీచం, ఛండాలం అది క్రైమ్ అని. నా పడక గదిలో కెమెరాలు పెడతాం ఫేస్‌బుక్‌లో దూరి తిడతాం అంటే ఇత్తడయిపోద్ది. పక్కవారి మంచి కోరుకుంటే మీరు బాగుంటారు. కాదు పరాయివల్ల నాశనం కోరుకుంటే ఎప్పటికీ దిగజారుడు బతుకుగానే ఉంటుంది. ఒకరిని సంతోష పెట్టకపోయినా పరవాలేదు బాధ పెట్టొద్దు ఎవరి అశాంతికి కారణం కావొద్దు” అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది మాధవీలత. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది.

శృంగారం కోసమే అమ్మాయిగా మారలేదు : జబర్దస్త్ సాయితేజ (పింకీ)

శృతీ హాసన్.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి కారణం ఇదే..!

‘మర్డర్’ ట్రైలర్.. కళ్ళ కట్టినట్టు చూపించిన వర్మ..!

మోసం చేశాడు.. వాడి పళ్లు రాలగొడుతా : సింగర్ సునీత ఫైర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -