Wednesday, April 17, 2024
- Advertisement -

కమిట్‌మెంట్ ఇస్తానే ఛాన్స్ ఇస్తారు : హీరోయిన్ మాధవీలత

- Advertisement -

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. అవకాశం పేరుతో లొంగ దీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ లో మీటు ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. అలానే టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని చాలా మంది సినీ తారలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ హీరోయిన్ మాధవీలత ఇదే క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది.

దర్శకనిర్మాతల పడక గదికి వెళ్తే తప్ప ఇక్కడ ఛాన్సులు రావని… వాళ్ల కోరిక తీస్తే తప్ప అవకాశం ఇవ్వారని సంచలన కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగాన్ని ఈ సందర్బంగా ఆమె వివరించింది. దీంతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయింది. నచ్చావులే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నాని హీరోగా వచ్చిన స్నేహితుడా సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత పెద్దగ కనిపించలేదు. మొన్న ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ కూడా చేసింది.

సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది సాధారణమని చెప్పిన మాధవీలత.. నిజానికి కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న సినిమా పూర్తి చేయడం అని అర్థం. కానీ ఇప్పుడు మన దర్శక నిర్మాతలు మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. కమిట్‌మెంట్ అనేది చాలా పవిత్రమైన పదమని, కానీ దాన్ని మనోళ్లు చెండాలం చేశారని చెప్పింది.

తనకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పింది మాధవీలత. అప్పట్లో తనను కూడా కమిట్మెంట్ అడిగారని, అయితే వాళ్ల ఆలోచన అర్థం చేసుకుని నో చెప్పినట్లు తెలిపింది. పడకగదికి వెళ్లి వాళ్ల కామవాంఛ తీరిస్తే తప్ప తెలుగులోనే కాదు.. ఎక్కడా హీరోయిన్లకు అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదని తెగేసి చెప్పింది మాధవీలత.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -