మాధవీలత ఆస్తి ఎంతో తెలుసా ?

1766
Madhavi Latha Total Assets Value
Madhavi Latha Total Assets Value

టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించటమే కాదు.. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి మొట్టమొదటగా ఓపెన్ గా మాట్లాడి షాక్ ఇచ్చింది అచ్చతెలుగు అందం మాధవిలత. అందానికి అందం ఉంది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడగలదు. ప్రశ్న ఏదైనా దాపరికం లేకుండా జవాబు చెబుతోంది. యూట్యూబుల్లో ఇంటర్వ్యూలు మస్తు ఫేమస్ కావటానికి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఒక కారణంగా చెబుతారు.

అప్పటివరకూ హీరోయిన్లు ఎవరూ చెప్పని విధంగా.. నిర్మోహమాటంగా విషయాల్ని తేల్చేసే ఆమెకున్న ఇమేజ్ పెంచేసుకుంది. అలాంటి ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆస్తి లెక్కలు మీద ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె జవాబు ఇస్తూ.. తనకు సొంతిల్లు అంటూ లేదని వెల్లడించింది. కమిట్ మెంట్లకు వ్యతిరేకం కావటమే కాదు.. తేడా వస్తే చెంప చెల్లుమనిపిస్తానని చెప్పింది.

పలువురు దర్శకుల వేధింపులకు తాను గురైనట్లు చెప్పేసి సంచలనంగా మారిన మాధవిలత.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సినిమాల్లో నటించటం కంటే కూడా తాను.. షోరూంలు..షాపులు ఓపెనింగ్ ద్వారానే ఎక్కువ సంపాదించినట్లుచెప్పింది. మొత్తానికి సినిమారంగంలో తారగా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నా.. సంపాదన.. ఆస్తిపాస్తుల్ని మాత్రం ఎక్కువగా కూడబెట్టలేకపోయానని చెప్పింది.

Loading...