Thursday, April 25, 2024
- Advertisement -

ఆ వ్యాపారంలో దూసుకెళ్తున్న తెలుగు హీరోయిన్..!

- Advertisement -

హీరోయిన్లు అంటే వాళ్లు సినిమాలు చేసుకోవడం.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం.. అవకాశం ఉంటే బ్రాండ్ అంబాసిడర్లుగా చేసుకోవడం.. లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ ల రిబ్బన్ కటింగులు చేసుకోవడం వంటి పనులు మాత్రమే చేసుకొంటూ ఉంటారనుకొంటాం. అయితే కొంతమంది మాత్రం వ్యాపారాల్లో దూసుకుపోతున్నారు.

ఇప్పటికే ఇలాంటి వారు కొంతమంది వార్తల్లోకి రాగా.. తాజాగా మాధవీలత కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించింది.

ఈ తెలుగమ్మాయి ‘నచ్చావులే’ సినిమాతో తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు బాగానే లభించాయి. అయితే సరైన హిట్ దక్కకపోవడంతో మాధవీలత పని ఖాళీ అయ్యింది. అయితే ఈ ఖాళీలో ఈ భామ ఊరికే ఉండలేదు. వివిధ రకాల వ్యాపారాలు చేస్తోంది. 

ఆమెకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి పట్టు ఉందనిసమాచారం.కొన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ లో బాగా సంపాదించేస్తోంది ఈ హీరోయిన్. ఇంతే కాదు.. ఈ హీరోయిన్ ఇప్పుడు కొత్తగా ఒక ఐటీ కంపెనీని కూడా ప్రారంభించింది. ఈ కంపెనీకి  తను చైర్ పర్సన్ హోదాలో ఉంటుంది. అంతే కాదు.. మాధవిలత ఒక విదేశీ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీని కూడా పూర్తి చేసింది. మొత్తానికి సినిమాల కన్నా వేరే రకంగానే మాధవిలత బాగా సెటిలయ్యేలా ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -