Friday, April 26, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడుకి షాకిచ్చిన మ‌హేశ్ బాబు

- Advertisement -



అర్జున్ రెడ్డి తెలుగు సినిమా ద‌శ దిశ మార్చిన సినిమా. ఈ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోల‌ను సైతం ఆలోచ‌న‌లో ప‌డేసిన సినిమా ఇది. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అయితే ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోని చేసిని ఈ సినిమా అర్జున్ రెడ్డి. అలాంటి సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించిన సందీప్ రెడ్డి వంగాకు షాకిచ్చాడు మ‌న సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు. అర్జున్ రెడ్డి త‌రువాత మ‌హేశ్ బాబుతో సందీప్ రెడ్డి ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌హేశ్ పిలిచి మ‌రి సందీప్‌కు అవ‌కాశం ఇచ్చాడ‌ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పాడు. మహేశ్ బాబు కోసం తాను సిద్ధం చేసిన కథను ఇటీవల ఆయనకి సందీప్ రెడ్డి వినిపించాడట.

అయితే సందీప్ వినిపించిన క‌థ‌ను మ‌హేశ్ రిజెక్ట్ చేశాడ‌ని స‌మాచారం. హీరో క్యారెక్టరైజేషన్ తన బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా లేదని , అందుకే మ‌హేశ్ ఈ క‌థ‌ను నో చెప్పాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త‌న కోసం సందీప్‌ను మ‌రో క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌న్నాడ‌ట మ‌హేశ్‌. ఎట్టి ప‌రిస్థితుల్లో సందీప్‌తో ఓ సినిమా చేయ‌ల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట మ‌హేశ్‌. అయితే క‌థ‌ల విష‌యంలో ఎటువంటి మొహమాటం పోకూడ‌ద‌ని ఫిక్స్ అయ్యాడ‌ట మ‌హేశ్‌. అందుకే సుకుమార్ చెప్పిన క‌థ‌లో కూడా చాలా మార్పులు చెప్పాడ‌ట. మ‌హేశ్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా మ‌హ‌ర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. వ‌చ్చే నెల 25న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -