మ‌రోసారి మంచి మ‌న‌స్సును చాటుకున్న మ‌హేశ్ బాబు

317
Mahesh Babu fulfills wishes of Parvin Bybi From Srikakulam Who Is Suffering From Cancer
Mahesh Babu fulfills wishes of Parvin Bybi From Srikakulam Who Is Suffering From Cancer

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఎంత‌టి అంద‌మో ,అంత‌కుమించిన మ‌న‌స్సు ఆయ‌న‌ది. త‌న మంచి మ‌న‌స్సును ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మంచి మ‌న‌స్సును చాట‌కుంటునే ఉన్నారు. అభిమాన మ‌న‌స్సులతో పాటు, సామాన్య ప్రజ‌ల మ‌న‌స్సును కూడా దోచుకుంటున్నారు. తాజాగా మ‌హేశ్ బాబు కేన్సర్‌తో బాధ‌ప‌డుతున్న ఓ బేబీని ఆదుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళానికి చెందిన పర్వీన్ బేబి(12) కేన్సర్‌తో బాధపడుతోంది. ఆ పాప‌కు మ‌హేశ్ బాబు అంటే పిచ్చి అభిమానం. ఈ విష‌యం తెలుసుకున్న మ‌హేశ్ శ్రీకాకుళం వెళ్లి మ‌రి ఆ పాప‌ను క‌లుసుకున్నాడు. పర్వీన్ ఇంటికి వెళ్లి మ‌రి క‌లిసి చాలా సేపు అక్కడే గడిపాడు. పర్వీన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఆమె వైద్య‌నికి అయ్యే ఖ‌ర్చు మ‌హేశ్ బాబు భ‌రిస్తాన‌ని చెప్పి మ‌రి వాళ్ల ఫ్యామిలీకి భ‌రోసాను ఇచ్చార‌ట మ‌హేశ్‌.

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తున్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఉగాది నాడు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను మే 9న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. మ‌హ‌ర్షి మ‌హేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.