Wednesday, April 24, 2024
- Advertisement -

గొప్ప మనసు చాటుకున్న మహేష్.. చిన్నారికి ప్రాణం పోశాడు..!

- Advertisement -

టాలీవుడ్ ప్రిన్స్ సుపర్ స్టార్ మహేశ్ బాబు గొప్ప మనసు చాటుకున్నాడు. గుండె జబ్బు మెదడు జబ్బుతో పోరాడుతున్న ఓ చిన్నారికి ప్రాణం పోసి రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు. విషయంలోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు అరుదైన గుండె జబ్బుతో బిడ్డ పుట్టింది.

ఆ చిన్నారి గత కొన్ని రోజులుగా ఈ జబ్బుతో బాధపడుతోంది. అయితే తల్లిదండ్రుల వద్ద చికిత్స చేయించేందుకు డబ్బు లేదు. దాంతో మహేష్ బాబు ను ఆసృయించిన తల్లిదండ్రులు మహేశ్ బాబుకు చిన్నారి సమస్య గురించి తెలియజేశారు. చిన్నారి బాధ్యతను మహేశ్ తన భుజాలపై వేసుకొని ఆంధ్ర హాస్పిటల్ ను చిన్నారికి వైద్యం చేయవాల్సిందిగా కోరాడు, చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చును తానే కడతానని వారిని చికిత్సకు ఒప్పించాడు. పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లకు సూచించారు. 2 వ తేదీన శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆ చిన్నారిని ఆబ్సర్వేషన్ లో పెట్టారు.

ఆపరేషన్ అనంతరం పాప పరిస్థితి మరీ దారౌనంగా మారింది, బీపీ పడిపోవటం చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోవడం జరిగాయి. ఐ‌సీ‌యూ కు తరలించి మరింత మెరుగైన చికిత్స అంధించడంతో చిన్నారి రికవర్ అయ్యింది. తర్వాత రెండు వారాల తర్వాత చిన్నారి ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యింది. దాంతో చిన్నారిని ఆసుపత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేశారు, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇంత పెద్ద సాయం చేసినందుకు మహేష్ బాబుపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ మనసు గొప్పదని అని అంటున్నారు.

తల్లితో సొంత ఊరు వెళ్లి సాయం చేసిన అనసూయ..!

నన్ను లొంగ తీసుకునేందుకు ప్రయత్నించారు : రెజినా

వర్మ ‘మర్డర్’ సినిమా ఘాటుగా స్పందించిన అమృత..!

ఫాదర్స్ డే రోజు దిల్ రాజుకి సర్ ఫ్రైజ్ ఇచ్చిన కూతురు హన్షిత..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -