Thursday, April 25, 2024
- Advertisement -

1000 మందికి ప్రాణం పోసిన మహేష్ బాబు..!

- Advertisement -

మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. ఈ విషయం పక్కన పెడితే మహేష్ బాబులో గొప్ప మనసు గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే ఆయన ఏ సాయం చేసిన పబ్లిసిటీ చేసుకోరు. అదే ఆయన గొప్పతనం. చేసిన సాయం ఆ చేతికి తప్ప మరో చెవిన పడకూడకు అనుకుంటారు మహేష్. టాప్ స్టార్ గా ఏడాదికి వందల కోట్ల సంపాదన మహేష్ సొంతం.

అలాగే ఆయన సొంతగా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆ సంపాదనలో కొంత మొత్తంను సామాజిక సేవ గురించి ఉపయోగిస్తారు. మహేష్ ఎప్పటి నుండి గుండె జబ్బుతో బాధపడుతున్న పసిపిల్లకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. వారి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మహేష్ బాబే భరిస్తున్నారు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మహేష్ కానీ, ఆయన టీం కానీ ఈ సేవాకార్యక్రమం గురించి బయటపెట్టలేదు. ఐతే ఈ విషయం అనోటాఈనోటా పడి మీడియా వరకు చేరింది.

తాజాగా మహేష్ చిన్నపిల్లలకు చేయించిన ఆపరేషన్స్ సంఖ్య 1010 కి చేరింది. వెయ్యికి పైగా పసి ప్రాణాలను మహేష్ కాపాడాడు. అలాగే మహేష్ రెండు గ్రామాలను దత్తత తీసుకొని మౌళిక సదుపాయాలు సమకూర్చుతున్నారు. మహేష్ సినిమాలోనే సూపర్ స్టార్ కాదు.. నిజజీవితంలో కూడా సూపర్ స్టారే. ఇక మహేష్ తాజాగా నటించబోతున్న సర్కారు వారి పాట సినిమా త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాకి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ అదిరింది..!

పవర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ..!

హీరోయిన్ ని ముద్దులతో ముంచెత్తిన వర్మ..!

రష్మీ, అనసూయ యాంకరింగ్‌ నాకు నచ్చదు : ముక్కు అవినాష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -