Friday, March 29, 2024
- Advertisement -

మహేష్ కి ఈ సారి మీసం అవసరం లేదా?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రోజుల తర్వాత మహర్షి సినిమా కోసం తన లుక్ ని మార్చారు. ఈ సినిమా లో మూడు విభిన్న పాత్రలు పోషించగా, ఒక్కో పాత్ర కి ఒక్కో వైవిద్యమైన లుక్ ఉండేలా ప్లాన్ చేసుకొని, దానిని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇకపోతే ఇప్పుడు మహేష్ తన ధ్యాస మొత్తం తదుపరి చిత్రం సరిలేరు నాకెవరు పైన ఉంచారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో త్వరలో రానున్న ఈ చిత్రం లో మిలిటరీ బాక్డ్రాప్ ఉంటుంది కానీ మహేష్ సైనికుడి గెటప్ ని మాత్రం వేయడం లేదట. ఒక కథ గా చెప్పుకోవడానికి బాక్గ్రౌండ్ లో మిలిటరీ ని వాడుకోనున్న చిత్ర యూనిట్, మహేష్ ని సైనికుడి లా చూపించే ప్రయత్నాలు ఏమి పెట్టుకోలేదు అని వినికిడి.

కాకపోతే కథ ప్రకారం ఆర్మీ నుంచి సొంత ఊరికి వ‌చ్చిన సైనికుడి పాత్ర లో మహేష్ కనిపించనున్నాడట. అందుకే ముందుగా మహేష్ సైనికుడి గెటప్ కి అనుగుణం గా తన లుక్ ని మార్చుకుంటారు అని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు అదేమి లేదని, ఉన్న లుక్ కి కాస్త చేంజ్ తీసుకొని వచ్చి షూటింగ్ కానిచేస్తారట. సో ఈ సినెమా లో కూడా మహేష్ మీసం పెంచుకోవసిన అవసరం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -